సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కొత్త దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.  ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో స్టూడెంట్ లీడ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.