Asianet News TeluguAsianet News Telugu

ఒకవేళ నాకు కరోనా వస్తే.. హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

`ప్లాస్మా దానం చేస్తే ఇద్దరిని కాపాడిన వారు అవుతారు. రికవరీ అయిన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరుకుంటున్నా. వాక్సిన్ ఎప్పుడోస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మన దగ్గరున్న ఆయుధం ఇదొక్కటే. ఒకవేళ నాకు కరోనా వస్తే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తా` అన్నారు  విజయ్‌ దేవరకొండ.

Vijay Deverakonda Felicitates Plasma Donors Pledges To Donate If Recovered
Author
Hyderabad, First Published Aug 1, 2020, 8:34 AM IST

కరోనా ను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా డొనేట్ చేసిన వారిని హీరో విజయ్ దేవరకొండ, సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌ లో సన్మానించారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనర్స్ పోస్టర్ ను హీరో విజయ్ దేవర కొండ లాంచ్ చేసారు.

చీఫ్ గెస్ట్ గా హాజరైన హీరో విజయ్ దేవర కొండ మాట్లాడుతూ.. `పోయిన నెల మాకు తెలిసిన వ్యక్తులకు కరోనా వచ్చింది. వారికి ప్లాస్మా అవసరం వచ్చింది.. కానీ ఎక్కడా ప్లాస్మా దాతలు దొరకలేదు. అప్పుడు ప్లాస్మా ప్రాధాన్యత తెలిసింది. ఇంతకు ముందు ప్లాస్మా డొనేట్ చేయాలంటే కన్‌ఫ్యూజన్‌ ఉండేది. కానీ ఇప్పుడు donateplasma.scsc.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అయితే చాలు.

ప్లాస్మా దానం చేస్తే ఇద్దరిని కాపాడిన వారు అవుతారు. రికవరీ అయిన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరుకుంటున్నా. వాక్సిన్ ఎప్పుడోస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మన దగ్గరున్న ఆయుధం ఇదొక్కటే. ఒకవేళ నాకు కరోనా వస్తే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తా` అన్నారు  విజయ్‌ దేవరకొండ.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. `ప్లాస్మా డొనేట్ చేసిన వారిని అభినందిస్తున్నాను. ఎన్నో అపోహల మధ్య ఎందరో ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు.కరోనా విషయంలో ప్రపంచం మొత్తం ఏకం అవుతుంది. ఒక్క కోవిడ్ పేషెంట్ 500 ఎంఎల్  ప్లాస్మా దానం చేస్తే ఇద్దరు కోవిడ్ పేషేంట్ లను కాపాడ వచ్చు.ఈ రోజు 120 మంది ప్లాస్మా దానం చేశారు.200 మంది పేషెంట్ ను కాపాడాము..ప్లాస్మా దానం చేసిన వారు కరోనా యోధులు.. వాళ్ళు దేవుడితో సమానం. సామాజిక బాధ్యత లో భాగంగా ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయాలి"అన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios