స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. మూవీ టీమ్ గుమ్మడికాయ కొట్టేశారు.

ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ఫినిష్ 

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. మూవీ టీమ్ గుమ్మడికాయ కొట్టేశారు. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. "ఫ్యామిలీ స్టార్" సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

'లవ్ గురు'గా వస్తున్న విజయ్ ఆంటోని 

వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న సినిమా "లవ్ గురు". ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. "లవ్ గురు" సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు. ఇవాళ "లవ్ గురు" సినిమా ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. 

హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ - దాదాపు 95 శాతం మందికి లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా అబ్బాయిలకు. గర్ల్స్ ను హ్యాండిల్ చేయడం అనేది అబ్బాయిలకు పెద్ద సమస్య. ఈ "లవ్ గురు" సినిమా చూస్తే గర్ల్స్ ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. నేనే లవ్ గురులా ఆ పరిష్కారాలు చెబుతాను. ఈ సినిమాలో లీలా అనే అమ్మాయితో నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాను. ఆ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాను అనేది ఫన్నీగా దర్శకుడు వినాయక్ సినిమాలో చూపించాడు. ఏప్రిల్ 11న రంజాన్ సందర్భంగా తెలుగు స్టేట్స్ లో సుమారు 500 నుంచి 600 థియేటర్స్ లో "లవ్ గురు" సినిమాను విడుదల చేయబోతున్నాం.

షరతులు వర్తిస్తాయి సక్సెస్ మీట్ 

చైత‌న్య రావ్, భూమి శెట్టి జంట‌గా న‌టించిన సినిమా "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి". కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. నిన్న "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. 


హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ - మంచి సినిమా చేశామని మేము ఎంత చెప్పుకున్నా..మీరు ఇచ్చే చిన్న పాజిటివ్ రెస్పాన్స్ ఎంతో హెల్ప్ చేస్తుంటుంది. అలాంటి మౌత్ టాక్ మాకు ఇప్పుడు కావాలి. మీరు ఒకవేళ సినిమా చూసి ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమాకు మీడియా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు. మా జీఎస్ కే మీడియా అండగా నిలబడింది. నిన్న షో చూసి నా చిరంజీవి క్యారెక్టర్ బాగుందని పర్సనల్ గా వచ్చి చెప్పారు. రివ్యూస్ లోనూ నా బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చానని రాశారు. నాకు ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే నా ప్రతి సినిమాలోనూ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" ఒక మంచి సినిమా. ఈ సినిమా చూసేందుకు ఎలాంటి షరతులు లేవు. మీ దగ్గర్లోని థియేటర్ కు వెళ్లి చూడండి. రెండు గంటలు ఎంగేజ్ అవుతారు. అన్నారు.

టిల్లుగాడి కొత్త పాట రెడీ 

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 29న రిలిజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచుతోంది. తాజాగా ఈ చిత్రంలోని ఓ మై లిల్లీ అనే పాట ప్రోమో రిలీజ్ చేశారు. 

కంప్లీట్ సాంగ్ ని మార్చి 18న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో టిల్లు స్క్వేర్ కోసం యువత ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఫుల్ ఖుషీగా రజాకార్ బ్యూటీ 

చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రజ‌లే సాయుధులై క‌ద‌న రంగంలోకి దూకి చేసిన పోరాటం.. ఇప్పటికీ స‌జీవం. అలాంటి కథను ‘ర‌జాకార్’ రూపంలో భావోద్వేగ‌భ‌రితంగా తెర‌పై చూపించిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన ఆనందాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా సంతోషాన్ని ఇచ్చింది'' అన్నారు నటి అనుశ్రీ.

ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల నటి అనుశ్రీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో అనుశ్రీ .. నిజాం భార్య పాత్రలో నటించారు. అలాగే ఇందులో వున్న ఏకైక గ్లామర్ రోల్ నాదే. ఇలాంటి బలమైన కథ, పాత్రతో నా కెరీర్ ప్రారంభం కావడంతో నా కల నెరవేరినట్లయింది. ఈ పాత్ర కోసం మూడు నెలలు పాటు మెథడ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. మకరంద్ దేశ్ పాండే గారితో లుక్ టెస్ట్ చేసి ఓకే అనుకున్న తర్వాతే నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఈ పాత్ర నా కెరీర్ గొప్పగా కలిసొస్తుందని భావిస్తున్నాను అని అనుశ్రీ తెలిపింది.