Asianet News TeluguAsianet News Telugu

క్రేజ్ కోసం:‘అర్జున్‌రెడ్డి’టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు

నిర్మాతలు తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లటానికి రకరకాల స్కెచ్ లు వేస్తూంటారు. ముఖ్యంగా డబ్బింగ్ నిర్మాతలు అయితే వెరైటీ ఆలోచనలు చేస్తూంటారు. ఏ టైటిల్ పెడితే జనాల దృష్టి పడుతుందో చూస్తారు. తాజాగా ఓ తమిళ డబ్బింగ్ నిర్మాత విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘ద్వారక’ చిత్రం ఇప్పుడు తమిళంలో ‘అర్జున్‌రెడ్డి’టైటిల్ ని మార్చి విడుదల చేస్తోంది.

Vijay Deverakonda Dwaraka as Arjun Reddy
Author
Hyderabad, First Published Feb 2, 2019, 10:39 AM IST

నిర్మాతలు తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లటానికి రకరకాల స్కెచ్ లు వేస్తూంటారు. ముఖ్యంగా డబ్బింగ్ నిర్మాతలు అయితే వెరైటీ ఆలోచనలు చేస్తూంటారు. ఏ టైటిల్ పెడితే జనాల దృష్టి పడుతుందో చూస్తారు. తాజాగా ఓ తమిళ డబ్బింగ్ నిర్మాత విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘ద్వారక’ చిత్రం ఇప్పుడు తమిళంలో ‘అర్జున్‌రెడ్డి’టైటిల్ ని మార్చి విడుదల చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ బ్యానరుపై ఏఎన్‌ బాలాజీ తమిళంలో నిర్మిస్తున్నారు.

‘అర్జున్‌రెడ్డి’టైటిల్  బాగా  పాపులర్ అవడంతో ఈ సినిమాకు అదే పేరును పెట్టినట్లు చిత్ర యూనిట్ చెబుతున్నాయి. పూజా జవేరి కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌, ప్రభాకర్‌, మురళీ శర్మ, సురేఖలు ఇతర తారాగణం. శ్యామ్‌ కె.నాయుడు సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరించారు. సాయికార్తిక్‌ సంగీతం సమకూర్చారు. శ్రీనివాస రవీంద్ర దర్శకత్వం వహించారు. 

నిర్మాత  ఏఎన్‌ బాలాజీ మాట్లాడుతూ.... ‘ద్వారాక’ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ‘అర్జున్‌రెడ్డి’ పేరుతో తమిళంలో అనువాదం చేశాం. ప్రేమ, యాక్షన్‌, కమర్షియల్‌ వంటి అంశాలన్నీ కలగలిసిన సినిమా ఇది. త్వరలోనే పాటల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, పలువురు సినీ ప్రముఖులు ఇందులో అతిథులుగా హాజరుకానున్నారని’ పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios