Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ కథతో రౌడీ హీరో నెక్ట్స్ ఫిక్స్?

స్క్రిప్ట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని టాక్.ఈ ప్రాజెక్టు ఒకే అయితే దీనిని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

Vijay Deverakonda Devarakonda Next With Gautham Tinnanury
Author
First Published Oct 19, 2022, 7:10 PM IST


  విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలు పెట్టుకున్న లైగర్ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో, పూర్తిగా సైలెంట్ అయ్యాడు విజయ్. ఆయన తన తదుపరి ప్రాజెక్టుల కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.  విజయ్ ప్రస్తుతం ఖుషీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ తో, స్టార్ హీరోయిన్ సమంత రొమాన్స్ చేస్తుండడంతో, ఈ చిత్రం పై మంచి అంచానాలే ఉన్నాయి. 

అయితే ఇప్పుడు తాజా మ్యాటర్ ఏంటంటే.. విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓ వార్త, సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ఏంటంటే, ఇప్పుడు విజయ్ మరో దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.జెర్సీతో నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకొని ఆ సినిమాని హిందీలో రీమేక్ చేసిన గౌతమ్ తిన్నునూరి చెప్పిన కథకి ఒకే చెప్పాడని వినికిడి.. విజయ్ కోసం ఈ దర్శకుడు  ఓ ఎమోషనల్ లవ్ డ్రామా కథను రెడీ చేస్తున్నాడట. స్క్రిప్ట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని టాక్.ఇది ఒకే అయితే దీనిని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇటీవల గౌతమ్ చెప్పిన లైన్, విజయ్ దేవరకొండకు బాగా నచ్చడంతో, సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విజయ్. దీంతో పూర్తి కథను చెక్కే పనిలో పనిలో ఉన్నాడట గౌతమ్. అయితే ఇదే కథలో రామ్ చరణ్ తో సినిమా చేయాలనుకున్నారని, కానీ అక్కడ బాగా లేటు అవుతూండటంతో ఈ ప్రాజెక్టు ఇటు టర్న్ అయ్యిందని చెప్తున్నారు. త్వరలోనే అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

మరో ప్రక్క విజయ్ ని...యంగ్ డైరెక్టర్ శశి కిరణ్ తిక్క  దర్శకత్వం వహించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. గూడాఛారి, మేజర్ చిత్రాలతో శశి కిరణ్ తిక్క మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. శశి కిరణ్ తిక్కా డైరెక్షన్ ఎలా ఉంటుదో, గూడాఛారి, మేజర్ చిత్రాలు నిరూంచాయి. థ్రిల్లింగ్ సబ్జెట్స్ డీల్ చేయడంలో శశి కిరణ్ మంచి దిట్ట. త్రివిక్రమ్ రెడీ చేస్తుంది థ్రిల్లింగ్ సబెక్ట్ అని టాక్. దీంతో ఇప్పుడు విజయ్ దేవర కొండ్ అండ్ శశి కిరణ్ కాంబో అనగానే, సిని జనాల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడే చాన్స్ ఉంది. ప్రముఖ హారికా హాసిని క్రియేషన్స్ కి అనుబంధ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించ నుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios