ఇల్లీగల్‌ బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన కేసులో విజయ్‌ దేవరకొండ ఈడీ విచారణ ఫేస్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 

DID YOU
KNOW
?
కింగ్డమ్‌తో విజయ్‌
విజయ్‌ దేవరకొండ ఇటీవల `కింగ్డమ్‌` మూవీతో ఆకట్టుకున్నారు. ఇది మంచి వసూళ్లని రాబట్టింది.

ఇల్లీగల్‌ బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన కేసులో హీరో విజయ్‌ దేవరకొండని ఈడీ విచారించింది. బుధవారం ఉదయం ఆయన ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ అనంతరం బయటకు వచ్చిన విజయ్‌ దేవరకొండ దీనిపై వివరణ ఇచ్చారు. అదే సమయంలో క్లారిటీ కూడా ఇచ్చారు. తాను చేసింది ఇల్లీగల్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కాదు అని, గేమింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని మీడియా గమనించాలని చెప్పింది. బెట్టింగ్‌ యాప్‌లు అక్రమమే కానీ, తాను చేసిన గేమింగ్‌ యాప్‌లు అని, అవి అధికారికంగా ప్రభుత్వం(చట్టబద్దంగా) చేత రిజిస్టర్‌ అయినవే అని అందులో ఇల్లీగల్‌ ఏం లేదని స్పష్టం చేశారు. 

నేను ప్రమోట్‌ చేసిన గేమింగ్‌ యాప్‌ చట్టబద్ధమైనదే..

ఏ 23, డ్రీమ్‌ లెవల్‌ ఇలా చాలా వరకు అధికారికంగా రిజిస్టర్‌ అయి ఉన్నాయని, క్రికెట్‌, వాలీబాల్‌ వంటి వాటికి స్పాన్సర్‌ షిప్‌లు ఇస్తుంటాయని, గేమింగ్‌ యాప్‌లు వేరు, బెట్టింగ్‌ యాప్‌ వేరు దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. తన బ్యాంక్‌ ఖాతాలు అన్ని హిస్టరీలు ఇచ్చానని, తన పేరు ఎందుకు వచ్చిందో వారికి కూడా అర్థం కాలేదు. నేను ప్రమోట్‌ చేసిన ఏ 23 గేమింగ్‌ యాప్‌కి అన్ని రకాల చట్టపరమైన అనుమతులు ఉన్నాయి అని చెప్పారు విజయ్‌ దేవరకొండ. 

నేను చెప్పిన వివరాలతో ఈడీ అధికారులు సంతృప్తి చెందారు

``ఏ23, మై 11 సర్కిల్, డ్రీమ్ 11 వంటి రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ ఇండియన్ క్రికెట్ టీమ్, మన ఒలంపిక్స్ టీమ్, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ లకు స్పాన్సర్స్ చేస్తుంటాయి. నేను ప్రచారం చేసింది ఏ23 గేమింగ్ యాప్ కు. ఇది పూర్తిగా రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్. ఈడీ అధికారులు అడిగిన కాంట్రాక్ట్, బ్యాంక్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అందించాను. నేను ఇచ్చిన వివరాలతో ఈడీ అధికారులు సంతృప్తి చెందారు. దేశంలో ఏది కరెక్ట్ ఏది కాదు అని నిర్ణయించేందుకు సుప్రీం కోర్టు ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి. వారు నిర్ణయిస్తారు`` అని అన్నారు విజయ్‌.

ఇల్లీగల్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో రానా, మంచు లక్ష్మీ పేర్లు కూడా

ఇల్లీగల్‌ బెట్టింగ్‌ యాప్‌ల కేసుని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు సినిమా సెలబ్రిటీల పేర్లు కూడా వినిపించాయి. విజయ్‌ దేవరకొండతోపాటు ప్రకాష్‌ రాజ్‌, రానా, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ కేసు ఈడీ చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఈడీ వరుసగా సెలబ్రిటీలను విచారిస్తోంది. గత నెల 30న ప్రకాష్‌ రాజ్‌ విచారించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 11న రానా, ఆగస్ట్ 13న మంచులక్ష్మీ ఈ విచారణకు హాజరు కానున్నారు.

`కింగ్డమ్‌`తో ఆకట్టుకున్న విజయ్‌ దేవరకొండ 

ఇదిలా ఉంటే విజయ్‌ దేవరకొండ ఇటీవల `కింగ్డమ్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అయ్యింది. మొదటి వీకెండ్‌లోనే రూ.80కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. సోమవారం నుంచి కాస్త డల్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఇంకా సుమారు ఇరవై కోట్ల గ్రాస్‌ రావాలి. అది సాధ్యమేనా అనేది చూడాలి. అది వస్తేనే మూవీ హిట్‌ ఖాతాలోకి వెళ్తుంది. ఇక ఇందులో సత్యదేవ్‌, వెంకటేష్‌ వైపీ ముఖ్య పాత్రలు పోషించారు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.