Asianet News TeluguAsianet News Telugu

200 కోట్లు కొట్టేంత వరకు ఎన్ని తిట్లైనా తింటా.. విజయ్‌ దేవరకొండ బోల్డ్ స్టేట్‌మెంట్‌..

`స్టేట్‌మెంట్‌ ఇవ్వడం తప్పు కాదు, స్టేట్‌మెంట్‌ ఇచ్చి కొట్టకపోవడం తప్పు అని అంటున్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన మరోసారి బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 
 

vijay deverakonda bold statement on family star for 200 crores collection arj
Author
First Published Apr 2, 2024, 11:13 PM IST

`లాస్ట్ సినిమా సమయంలో 200కోట్లు కొడుతున్నామనే స్టేట్‌మెంట్‌ ఇచ్చాను. కానీ కొట్టలేదు. దీంతో అంతా నన్ను తిట్టారు. నీ ఏజ్‌కి అలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వకూడదు, యారొగెన్సీ అనుకుంటారని చాలా మంది ప్రేమతో చెప్పారు, కొందరు కోపంతో చెప్పారు. కానీ రెండు వందల కోట్లు కొడతానని స్టేట్‌మెంట్‌ ఇవ్వడం తప్పుకాదు, ఇచ్చిన కొట్టకపోవడం తప్పు. ఆ విషయంలో ఈ తిట్లకి, కామెంట్లకి నేను అర్హుడినే. కానీ ఇప్పుడు చెబుతున్నా, రెండు వందల కోట్లు కొట్టేంత వరకు ఎన్ని తిట్లైనా తిట్టండి. కానీ ఏదో రోజు కొట్టి తీరుతా. ఇది నేను యారోగెన్సీతో, యాటిట్యూడ్‌తో చెబుతున్న విషయం కాదు, నాపై నాకున్న కన్ఫిడెన్స్ తో చెబుతున్న మాట` అని అన్నారు విజయ్‌ దేవరకొండ. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం `ఫ్యామిలీ స్టార్‌`. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి పరశురామ్‌ దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎలిమెంట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 5న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా నేడు మంగళవారం సాయంత్రం `ఫ్యామిలీ స్టార్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందులో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ, బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 200కోట్లు కొట్టి తీరుతా అని వెల్లడించారు. ఈ మూవీతోనే కొడతా అని చెప్పలేదుగానీ, కొట్టి తీరుతా, అప్పటి వరకు ఎన్ని తిట్లైనా భరిస్తానని తెలిపాడు విజయ్‌. 

తనపై తనకు నమ్మకం ఉందన్నారు. `ప్రతి రోజు బెడ్‌పై లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తా, అదే నమ్మకంతో పనికి వెళ్తా, ఇక్కడ నిలబడటం కూడా అదే నమ్మకంతో నిలబడతా, ఇంకొక్కరు స్టార్‌ అయితే మనం అవ్వలేమా ఏంటి? నేను స్టార్‌ అయితే మీరు అవ్వలేరా ఏంటి? ఇంకొకరు రెండు వందల కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి? నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్లీ కొట్టలేరా ఏంటి?` అంటూ క్రేజీ కామెంట్స్ తో ఊర్రూతలూగించాడు విజయ్. 

ఆయన ఇంకా చెబుతూ, ఇదంతా ఒక జర్నీ అని, `గీతగోవిందం` నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా తనకు చాలా ముఖ్యమని, ప్రతి మూవీ తనకు ఏదో ఒక విషయాన్ని నేర్పించిందని చెప్పారు విజయ్‌. `మీరు కూడా యాక్టర్లు అవ్వాలనుకుంటారు, దర్శకులు, కంటెంట్‌ క్రియేటర్లు, బిజినెస్‌ మ్యాన్‌లు అవ్వాలనుకుంటారు. ఈ జర్నీలో మీరు చాలా హై చూస్తారు, లో చూస్తారు. ఫెయిల్యూర్స్, అవమానాలు, కిందకి లాగేవాళ్లని చూస్తారు. కానీ మనం ఒకటి ఫిక్స్ అయ్యామంటే ఇవన్నీ దాటుకుని వెళ్లాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి` అని తెలిపారు విజయ్‌

ఇందులో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. `ఫ్యామిలీ స్టార్‌` మూవీని తాను ఎందుకు చేశాడో తెలిపారు. దర్శకుడు బుజ్జీ ఈ కథని నా వద్దకు తీసుకొచ్చినప్పుడు నా జీవితంలో ఎన్నో విషయాలు గుర్తుకు వచ్చాయి. మా నాన్న గుర్తుకు వచ్చారు. మాకు కష్టాలు తెలియవద్దని మా నాన్న కష్టాలు పడ్డాడు. ఇంట్లో డబ్బులు తక్కువ అయినా, మాకు డబుల్‌, త్రిబుల్ ప్రేమని పంచిన అమ్మ, అమ్మమ్మ, ఫ్యామిలీ బాగుండాలని మా కోసం యూకే వెళ్లిపోయిన మా మామయ్య, చిన్న చిన్న పనులు చేసుకుంటూ స్థాయి పెంచుకుని మాకోసం ఇండియాకి పంపించిన మామయ్య, మా పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, మా తమ్ముడు యూఎస్‌ వెళ్లాలంటే దుబాయ్‌ నుంచి మా పెద్దన్నయ్య డబ్బులు ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగం చేసే మా పెద్దమ్మ ఇళ్లు తాకట్టు పెట్టి, ఇలా మా మిడిల్‌ క్లాస్‌లో అందరు కలిస్తే మేం ఇక్కడ ఉన్నాం.  

వాళ్లందరు గుర్తుకు వచ్చి ఒప్పుకున్న సినిమా, వాళ్లందరికోసం చేసిన సినిమా ఇది. ప్రతి ఇంట్లో స్టార్‌ ఉంటడు. ఆ స్టార్‌ ఫ్యామిలీ స్టార్‌. మన ఫ్యామిలీ నుంచి ఒకడు పోయి సినిమా తెరపై కనిపించడం, డాన్సులు చేయడం, ఫైట్లు చేయడం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాన్ని మనం ఎంజాయ్‌ చేస్తాము. అందుకే ఈ మూవీ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఒక బ్లెస్సింగ్‌లాగా భావిస్తున్నా` అని తెలిపారు విజయ్‌. ఈ సినిమా తన నటన నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని, దాని క్రెడిట్‌ దర్శకుడికే ఇస్తానని తెలిపారు విజయ్‌. ఇక చివరగా తనకు కొత్తగా బ్రేకులు వద్దని, మా నాన్న గోవర్థన్‌ పేరు నిలబెట్టుకునేలా చూడు దేవుడా అంటూ ఆడియెన్స్ చేత ప్రార్థన చేయించడం హైలైట్ గా నిలిచింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios