విజయ్ దేవరకొండ హీరోయిన్ పూజ హెగ్డే మీద మనసుపడ్డాడట. తన నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా తీసుకోవాలని సలహా ఇస్తున్నాడట.   

పర్టిక్యులర్ హీరోయిన్ నాకు బాగా సెట్ అవుతుంది. మా కాంబినేషన్ బాగుంటుందని హీరోలు కోరుకోవడం సహజం. కొందరేమో సెంటిమెంట్ కోసం ఫలానా హీరోయిన్ కావాలని పట్టుబడతారు. విజయ్ దేవరకొండ అనూహ్యంగా అట్టర్ ప్లాప్స్ లో ఉన్న హీరోయిన్ ని జంటగా అడుగుతున్నాడట. ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు పూజా హెగ్డే. వరుసగా ఐదు ప్లాప్స్ ఇచ్చిన పూజా హెగ్డే పై ఆయన మనసుపడ్డాడట. 

ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ అనంతరం పూజా హెగ్డే కి హిట్ లేదు. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ లతో పాటు సల్మాన్ ఖాన్ తో చేసిన కిసీ కా భాయ్ కీసీ కీ జాన్ సైతం ప్లాప్ అయ్యింది. దీంతో పూజా పట్ల దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. కాగా విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మాణంలో పరుశురామ్ దర్శకత్వంలో మూవీ ప్రకటించారు. ఈ చిత్ర హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకోవాలని సూచిస్తున్నాడట. 

దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. పూజా హెగ్డే-విజయ్ దేవరకొండ కలిసి నటించిన జనగణమన మూవీ మధ్యలో ఆగిపోయింది. అదో బ్యాడ్ సెంటిమెంట్. అయినా విజయ్ మాత్రం ఆమెనే కావాలంటున్నాడట. పూజా హెగ్డే చేతిలో ఉన్న ఒకే ఒక ప్రాజెక్ట్ గుంటూరు కారం. అది కూడా ప్లాప్ అయితే ఇక పూజా దుకాణం సర్దినట్లే...