విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా రీసెంట్ గా డియర్ కామ్రేడ్  విడుదలైన సంగతి తెలిసిందే. ఈ జంట ఇంతకు ముందు ‘గీత గోవిందం’ ‌లో కూడా  అదరగొట్టారు. డియర్ కామ్రేజ్ క్రేజ్ అంతలా రావటానికి కారణం ఈ పెయిరే. అది గమనించో ఏమో కానీ ఈ జంట మరోసారి జత కట్టనున్నట్లు సమాచారం.  హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమాలోనే విజయ్ కు జంటగా రష్మికను సైతం తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. 

ఇక ఈ సినిమాలో ముగ్గరు హీరోయిన్స్ ఉంటారని, అందులో రష్మిక ఒకరని చెప్తున్నరు. పూరి జగన్నాథ్  ఈ సినిమాని పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దబోతున్నట్లు చెప్తున్నారు. అయితే రష్మిక పూర్తిగా వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉంది. సరిలేరు నీకెవ్వరు లో మహేష్ సరసన చేస్తోంది. మరో ప్రక్క నితిన్ తో భీష్మ చేస్తోంది. అల్లు అర్జున్,సుకుమార్ కాంబో  చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసారు. దాంతో ఈ సినిమాకు డేట్స్ ఇవ్వటం కష్టమవుతోందనే అంటున్నారు. అయినా ఎలాగైనా ఆమెను తన సినిమాలోకి తీసుకోవాలని పూరి భావిస్తున్నారు. 
 
ఇక పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ ప్రకటించగానే ట్రేడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మరోసారి హాట్ డైరక్టర్ అయ్యిపోయారు పూరి. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే రికార్డ్ లు బ్రద్దల కొట్టడమే పనిగా పెట్టుకుంటుంది అంటున్నారు. మణిశర్మ ఇప్పటికే ఈ సినిమా కు ట్యూన్స్ రెడీ చేస్తున్నారట.