విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలసి రెండవసారి నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. గీతా గోవిందం చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. డియర్ కామ్రేడ్ లో కూడా అదే తరహా రొమాన్స్ తో ఈ జంట కనువిందు చేయబోతోంది. జులై 26న డియర్ కామ్రేడ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ కోసం బెంగుళూరులో మ్యూజిక్ ఫెస్టివల్ కు హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మీడియా పలు విషయాలపై మాట్లాడాడు. ఓ మీడియా ప్రతినిధి రష్మికతో లిప్ లాక్ సీన్స్ గురించి అడగగా విజయ్ ఆశ్చర్యకరంగా స్పందించాడు. 

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నేను రష్మికని ముద్దు పెట్టుకోవడమో, రష్మిక నన్ను ముద్దు పెట్టుకోవడమో కాదు.. బాబీ అనే పాత్ర లిల్లీ అనే పాత్రని ముద్దు పెట్టుకుంటుంది. సినీతారలు వెండి తెరపై నటిస్తున్నారు అని ప్రేక్షకులు మరచిపోయే ఏకైక దేశం ఇండియా అని విజయ్ తెలిపాడు. 

దానిని లిప్ లాక్ అని పిలవకూడదు. ముద్దు అని పిలవాలి.. ముద్దు అనేది ఒక ఎమోషన్ అని విజయ్ తెలిపాడు. తన గురించి లిప్ లాక్ అనే పదం విన్నప్పుడు 'what the f***' అని అనిపిస్తుందని విజయ్ దేవరకొండ సంచలనంగా స్పందించాడు.