విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం అర్జున్‌రెడ్డి.   తెలుగులో  సెన్సేషన్‌ సృష్టించిన ఈ చిత్రాన్ని.. మిగతా భాషల్లో కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలోనూ ‘కబీర్‌సింగ్’ టైటిల్‌తో షాహిద్‌కపూర్ హీరోగా రూపొందిస్తున్నాడు సందీప్‌రెడ్డి. రీసెంట్ గా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేసింది టీమ్. అర్జున్‌రెడ్డి ని మక్కీకి మక్కి దించేసినట్లు తాజాగా విడుదలైన టీజర్‌ చూసిన వారికి అర్దమైంది.

దాంతో డైరక్టర్ మీద నమ్మకంతో ఇంప్రవైజ్ చేస్తాడు అని ఆశపడినవాళ్లకు నిరాశ ఎదురైంది. అది ప్రక్కన పెడితే తాజాగా ఈ టీజర్ ప్రమోషన్ భాధ్యతను విజయ దేవరకొండ తీసుకున్నట్లున్నారు. ఆయన తన ట్విట్టర్ లో ఈ టీజర్ ని షేర్ చేసారు.

ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఈ టీజర్  టీజర్ అదిరిపోయింది అంటూ చిత్ర యూనిట్‌కి విషెష్ అందించారు విజయ్ దేవరకొండ.  ‘కబీర్ సింగ్’.. నా బెస్ట్ విషెష్ అందిస్తున్నా అంటూ దర్శకుడు సందీప్, షాహిద్ కపూర్, కియారా అద్వానీలకు శుభాకాంక్షలు తెలియజేశారు విజయ్ దేవకొండ. 

షూటింగ్  పూర్తిచేసుకున్న సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వానీ నటిస్తోంది.   జూన్ 21న సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.