టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన సినిమాలను, బ్రాండ్ లను ప్రమోట్ చేసుకోవడంతో దిట్ట. సరికొత్త పద్దతుల్లో ప్రమోషన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. అతడి మాటలు, చేష్టలు కూడా సినిమా ప్రమోషన్ కి బాగా ఉపయోగపడుతుంటాయి.

అతడు నటించిన 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా' సినిమాలను ఎలా ప్రమోట్ చేశాడో చూశాం. 'టాక్సీవాలా' సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకు ఫ్రీగా స్నాక్స్ ఇప్పించాడు. అలానే 'గీత గోవిందం' సినిమా సమయంలో తనపై జరిగిన ట్రోలింగ్ ని సినిమా ప్రమోషన్స్ కోసం వాడేశాడు.

ఇప్పుడు తన కొత్త సినిమా 'డియర్ కామ్రేడ్' కోసం కొత్త ప్రమోషనల్ ప్లాన్ వేశాడు. ఈ సినిమా సౌత్ లో నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో రెగ్యులర్ ప్రెస్ మీట్స్ అంటే రొటీన్ గా ఉంటుందని.. కొత్త ఐడియాని అమలు చేస్తున్నాడు. 'డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్' పేరుతో ఈవెంట్లు చేయబోతున్నారు.

బెంగుళూరు, చెన్నై, కొచ్చి, హైదరాబాద్, వైజాగ్ సిటీలలో ఓపెన్ లొకేషన్ సినిమాలోని పాటలు ప్లే చేస్తూ డాన్సులు చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ.. సినిమాను ప్రమోట్ చేయాలని ప్లాన్ చేశారు. బెంగుళూరులో జరిగే ఈవెంట్ కి 'కేజీఎఫ్' స్టార్ యష్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యూజిక్ ఫెస్టివల్ ఐడియా విజయ్ దే అని తెలుస్తోంది.