రౌడీ హీరో, విజయ్ దేవరకొండ తుఫాన్ రెంజ్ సినిమా సినిమాకు పెరిగిపోతోంది. చిన్న హీరోల వరుసలో నుంచి అగ్ర హీరోల జాబితాలోకి చేరిపోయాడు. అయితే విజయ్ తన రేంజ్ కు తగ్గట్టుగానే ఇటీవల ఓ ప్రయివేట్ జెట్ ను సొంతం చేసుకున్నాడంటా.!
‘నువ్విలా’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలతో తన కేరీర్ లో ముందడగు వేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎవరూ ఊహించని స్థాయికి చేరకున్నాడు. ‘పెళ్లి చూపులు’ మూవీతో స్టార్ డమ్ ను సొంత చేసుకున్న విజయ్ ‘అర్జున్ రెడ్డి’తో ఒక్కసారిగా టాలీవుడ్ ను షేక్ చేశాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ అగ్రేసివ్ నెస్ యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. పైగా ఈ సినిమా కోసం విజయ్ ఎంతో కష్టపడి మంచి అవుట్ పుట్ ను అందించాడు. తన కష్టానికి ఫలితంగా ఊహించని స్థాయిలో స్టార్ డబ్ ను సొంత చేసుకున్నాడు విజయ్.
అర్జున్ రెడ్డి తర్వాత వెనక్కి చూడకుండా కేరీర్ లో దూసుకెళ్తున్న విజయ్ అదే రేంజ్ లో విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతున్నాడు. కాగా ఓ ఇంటర్వ్యూలో తన మాట్లాడుతూ ‘నాకు ముందునునంచీ కార్లంటే చెప్పలేనంత ఇష్టం. అందుకే వాటిని కొనే అవకాశం వచ్చినప్పుడల్లా ఏ మాత్రం ఆలోచించను. నేను నచ్చే కార్లలో ఫోర్డ్ మస్టింగ్ ఒకటి.
దాదాపు 75 లక్షలు విలవచేసే ఆ కార్లో కూర్చుని వెళ్తుంటే ఆ కిక్కేవేరని ఒప్పుడు అనుకునేవాడిని. ఆ కారు కొని.. అందులో కూర్చుని రోడ్లమీద దూసుకుపోతున్నప్పుడు మొత్తానికి నేను అనుకున్నది సాధించగలిగాననే ఆనందం నాలో కలిగింది. ఈ కారే కాకుండా.. మెర్సిడెస్ బెంజ్ జీలె్సీ క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, వోల్వో ఎక్స్ సి 90, రేంజ్ రోవర్ లను నా గ్యారేజ్ కు షిఫ్ట్ చేసి సొంత చేసుకున్నాను’ అంటూ తెలిపాడు. ఈ తరహాలోనే తను ప్రయివెట్ జెట్ ను కూడా సొంతం చేసుకుని ఉంటాడని నెట్టింట తెగ చర్చ నడుస్తోంంది.
తాజాగా లైగర్ చివరి షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న విజయ్ ఓ జెట్ లోంచి దిగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘చాలా మంది ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించాలనుకుంటారు.. కానీ నేను ఓన్ జెట్ నే సొంత చేసుకున్నా’ అంటూ విజయ్ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో విజయ్ జెట్ సొంత చేసుకుంటాడని పలువురు, ఇప్పటికే కొనేశాడని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా అగ్ర హీరోలతో పోటీపడాలంటే విజయ్ కి ఆ మాత్రం ఉండాలంటూ పలువురు డైహార్ట్ ఫ్యాన్స్ అంటున్నారు.
