సారాంశం

ఒక్క సినిమా టాలీవుడ్ కు రౌడీ హీరోను అందించింది. విజయ్ దేవరకొండ కెరీర్ ను మార్చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. యూత్ ను అట్రాక్ట్ చేస్తూనే.. ప్యామిలీ ఆడియన్స్ ను కూడా అలరించిన పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి ఏడేళ్లు అవుతోంది. 
 


పెళ్లి చూపులు విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా . విజయ్ ఫ్యాన్స్ మనసుల్లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే  సినిమాల్లో పెళ్లి చూపులు కూడా ఒక‌టి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతూ వ‌ర్మ జంట‌గా న‌టించిన ఈసినిమాను తరుణ్ భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  ఈ చిత్రాన్ని బిగ్‌బెన్ సినిమాస్, ధర్మపథ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై రాజ్ కందుకూరి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ప్రియదర్శి, నందు, అనీష్ కురువిల్లా లాంటి యంగ్ స్టార్స్.. పవర్ ప్యాక్ పెర్ఫామెన్స్ అందించిన ఈసినిమా కు మ్యూజిక్ ప్లాస్ అయ్యింది అనుకోవచ్చు. ఈసినిమాకు  వివేక్ సాగర్ స్వ‌రాలు అందించాడు. 2016 జులై 29న రిలీజ్ అయ్యింది పెళ్లి చూపులు సినిమా.  అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది.  కలెక్షన్లతో పాటు ఎన్నో అవార్డుల‌ను, రివార్డుల‌ను కూడా సాధించింది పెళ్లి చూపులు. 

ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ సోలో హీరోగా ఫస్ట్ హిట్ ను అందుకున్నాడు.  షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే  తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో ఫిల్మ్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. 2  కోట్ల బడ్జెట్ తో నిర్మించిన  ఈ సినిమా.. సూపర్ సక్సెస్ సాధించి.. టాలీవుడ్  బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 15.73 కోట్ల షేర్‌,  30 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. 14.16 కోట్ల లాభాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈసినిమా తరువాత విజయ్ అర్జున్ రెడ్డి అవకాశం సాధించి.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నిలిచాడు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.