Asianet News TeluguAsianet News Telugu

సమంతని ఫస్ట్ టైం కాలేజ్ డేస్ లో చూశా, అప్పటి నుంచే లవ్.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ 

ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 11న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఉత్కంఠ భరితంగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.

Vijay Devarakonda opens up about his love on Samantha
Author
First Published Oct 28, 2022, 12:56 PM IST

సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి  బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత నెగిటివ్ షేడ్స్ లో నటించిన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రం నవంబర్ 11న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఉత్కంఠ భరితంగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. సరోగసి ద్వారా తల్లులు కావడం అనే కాన్సెప్ట్, దాని వెనుక జరుగుతున్న దారుణాలు నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. 

యశోద ట్రైలర్ ని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంతపై తనకున్న క్రష్, కాలేజ్ డేస్ నుంచి కొనసాగుతున్న లవ్ ని రివీల్ చేశాడు. నా కాలేజ్ డేస్ లో సమంతని తొలిసారి బిగ్ స్క్రీన్ పై చూశాను. అప్పటి నుంచే ఆమెపై ప్రేమ మొదలయింది. 

ఈరోజు ఆమె సాధించిన ప్రతి ఘనతకి అభిమానిగా మారిపోయా అంటూ యశోద ట్రైలర్ షేర్ చేశాడు. సమంత, విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి చిత్రంలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

మహానటి చిత్రంలో వీరిద్దరూ కలసి నటించారు. ఆ మూవీలో సామ్, విజయ్ కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఖుషి చిత్రంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. అంతకంటే ముందుగా యశోద చిత్రంలో ప్రేక్షకులని పలకరించబోతోంది. ఈ మూవీలో సామ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా నటించింది. ఖుషి చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios