Asianet News TeluguAsianet News Telugu

హిట్టిచ్చిన దర్శకుడిని విజయ్ దేవరకొండ హీరోని చేస్తాడట?

అతి తక్కువ కాలంలోనే బాక్స్ ఆఫీస్ హిట్స్ చూసిన విజయ్ ఇప్పుడు ఇతర బిజినెస్ లతో కూడా ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. ముందుగానే రౌడీ వేర్ బ్రాండ్ తో బట్టలకు సంబందించిన బిజినెస్ మొదలుపెట్టాడు. 

vijay devarakonda movie with  pellichupulu  director
Author
Hyderabad, First Published Oct 7, 2018, 12:44 PM IST

టాలీవుడ్ లో ఇప్పుడున్న యువ హీరోల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అతి తక్కువ కాలంలోనే బాక్స్ ఆఫీస్ హిట్స్ చూసిన విజయ్ ఇప్పుడు ఇతర బిజినెస్ లతో కూడా ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. ముందుగానే రౌడీ వేర్ బ్రాండ్ తో బట్టలకు సంబందించిన బిజినెస్ మొదలుపెట్టాడు. ఇక రీసెంట్ గా హోమ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. 

కింగ్ ఆఫ్ ధీ హీల్ అనే బ్యానర్ ను స్థాపించి ఇటీవల నోటా సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. జ్ఞాన్ వెల్ రాజాతో కలిసి సినిమాను బాగానే రిలీజ్ చేసినప్పటికీ సినిమా కలెక్షన్స్ పరంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోయినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే దేవరకొండ తన ప్రొడక్షన్ లో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. 

ప్రస్తుతం అందుతోన్న సమాచారం ప్రకారం దేవరకొండ ఒక యువ దర్శకుడిని హీరోగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అతను తరుణ్ భాస్కర్ అని ఇంటర్నెట్ లో కొన్న్ని వార్తలు వైరల్ అక్కవుతున్నాయి. తనకు పెళ్లి చూపులు సినిమాతో మొదటి బాక్స్ ఆఫీస్ హిట్టిచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ కోసం విజయ్ సినిమాను నిర్మించడానికి ఏ మాత్రం సందేహించడం లేదని టాక్. త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios