రౌడీ హీరో విజయ్ దేవరకొండ చూస్తుండగానే ఈ మూడేళ్ళలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. ఎక్కడ ఎలాంటి కాంపిటీషన్స్ ఉన్నా కూడా హీరోగారి ప్రస్తావ లేకుండా ఏది జరగడం లేదు. అంటే సినిమాలకు సంబందించిన ఏ అవార్డ్స్ పోటీ జరిగినా విజయ్ దేవరకొండ పేరు వినబడాల్సిందే. 

రీసెంట్ గా జరిగిన హైదరాబాద్ 2018 మోస్ట్ డిజైరబుల్‌ మేన్‌ లిస్ట్‌లో విజయ్ టాప్‌ ప్లేస్‌ స్థానానికి చేరిపోయాడట. మహేష్ - ప్రభాస్ అలాగే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ ను ధాటి విజయ్ ఈ గుర్తింపు దక్కించుకున్నాడు అంటే అది మాములు విషయం కాదు. అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాలు ఈ యువ హీరోకు మంచి బూస్ట్ ఇచ్చాయని చెప్పవచ్చు. 

గత ఏడాది మోడల్ బసీర్‌ అలీ మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ లో విజయ్ నిలిచాడు.ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ యువ హీరో బిజీగా ఉన్నాడు.