సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేసింది. ఇప్పటికే సినిమాలో పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేశారు. ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
అయితే ఈ వేడుకకు మహేష్ తో ఇప్పటివరకు కలిసి పని చేసిన దర్శకులతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి. గతంలో మహేష్ నటించిన 'భరత్ అనే నేను' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అతిథిగా ఎన్టీఆర్ వచ్చాడు. నిజానికి రామ్ చరణ్ కూడా రావాల్సింది కానీ కుదరలేదు.
ఇప్పుడు ఆ ఇద్దరు హీరోలు మహేష్ కోసం వస్తారేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తుంటే.. సీన్ లోకి విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి అతిథిగా విజయ్ దేవరకొండ రాబోతున్నట్లు చిత్రబృందం పోస్టర్ వదిలింది. ఇది చూసిన అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు.
కొందరు సూపర్ కాంబినేషన్ అంటూ పొగుడుతుంటే.. మరికొందరు మాత్రం అవసరమా..? అసలేం జరుగుతుంది..? అంటూ విమర్శిస్తున్నారు. మహేష్ స్థాయికి విజయ్ ని గెస్ట్ గా పిలవడమేంటని మండిపడుతున్నారు.
ఈ ఊహించని అతిథిని మహేష్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఇది కదా మా హీరో క్రేజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఈ వేడుకకు అతిథిగా రాబోతున్నారని తెలుస్తోంది.
