టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు సినిమాలు వర్కౌట్ అవ్వకపోయినా.. సోషల్ మీడియా మాత్రం బాగా కలిసొస్తుంది. వరుసగా ప్లాప్ లు పడుతున్న ఫాలోయింగ్ లో మాత్రం తగ్గేదే లే అంటున్నాడు హ్యాండ్సమ్ హీరో.
వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా.. ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు. ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఎటువంటి మార్పు లేదు. ఇంకా పెరుగుతున్నారే తప్ప తగ్గడంలేదు. విజయ్ దేవరకొండకు అసలు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తుంటారు. జనాలు థియేటర్లకు క్యూ కడుతుంటారు. ముఖ్యంగా యూత్, విజయ్ దేవరకొండ సినిమాల అంటే యమా క్రేజ్ ఉంటుంది. ఒక్క తెలుగు రాఫ్ట్రాలలోనే కాదు.. పాన్ ఇండియాలో కూడా ఇదే పరిస్థితి.
విజయ్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అటు సోషల్ మీడియాలోనూ విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.తాజాగా తన సోషల్ ప్లాట్‌ఫాంలో విజయ్ దేవరకొండ రేర్ ఫిట్ సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండను ఏకంగా 18 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. కోటీ 80 లక్షల ఫాలోవర్స్ తో విజయ్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకున్న క్రేజ్‌ను విజయ్ దేవరకొండ చాలా తక్కువ టైమ్ లో.. చాలా అలవోకగా అందుకోవడంతో ఇండస్ట్రీలో ఇది హాట్ టాపకి్ గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. గీతా గోవిందం తరువాత విజయ్ దేవరకొండ కు సాలిడ్ హిట్ అంటూ పడలేదు. ఒక్క టాక్సీవాలా మాత్రమే పర్వాలేదు అనిపించింది. ఆతరువాత వచ్చిన సినిమాలన్నీ ధారుణంగా పోయాయి. అయినా సరే పట్టుదలతో సినిమాలు చేస్తున్నాడు విజయ్. ఇక రీసెంట్ గా పాన్ ఇండియ లేవల్లో పూరీజగన్నాథ్ డైరెక్ట్ చేసిన గీతగోవిందం సినిమా ధారుణ పరాజయంతో.. విజయ్ నిరాశలో పడిపోయారు. ఇక ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ క్రేజీ స్టార్. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈసినిమా హిట్ అయితేనే.. విజయ్ దేవరకొండ కెరీర్ కాస్త గాడిన పడుతుంది. లేదంటే..విజయ్ కెరీర్ డేంజర్ జోన్ లో పడినట్టే అని చెప్పవచ్చు. అలా అవ్వకుండా.. ఏదోఒక రకంగా.. క్రేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రౌడీ హీరో.
