రౌడీ హీరో ఫ్యాన్స్ కు  గుడ్ న్యూస్.. బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ ట్రెండ్ మార్క్ మూవీని విజయ్ దేవరకొండ రీమేక్ చేయబోతున్నాడు. ఇంతకీ ఆ మూవీ ఏంటీ..? ఎవరు దర్శకుడు..?  

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం కమర్షియల్‌ హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు విజయ్ దేవరకోండ సరికొత్త ప్లాన్ తో ముందుకు రాబోతున్నాడు. అటు బాలీవుడ్ ను .. ఇటు టాలీవుడ్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. లైగర్ తో పాన్ ఇండియా లెవల్లో హీరోగా సెట్ అవుదాం అనుకున్న విజయ్ దేవరకొండకు డిజాస్టర్ ఎదురయ్యింది. దాంతో మరోసారి పక్కా ప్లాన్ తో పాన్ ఇండియా సినిమాతోనే ముందుకు రావాలని చూస్తున్నాడు. 

ఇండియన్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ట్రెండ్ మార్క్ మూవీతో విజయ్ దేవరకొండ ప్రయోగం చేయబోతున్న్టటు తెలుస్తోంది. గీతా గోవిందం వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాను ఇచ్చిన పరుశురాంతో విజయ్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వీళ్ళ కాంబోలో తెరకెక్కబోయే సినిమా బాలీవుడ్‌ రీమేక్ అని తెలుస్తుంది. షారుఖ్‌ఖాన్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగ సినిమాను రీమేక్‌ చేస్తున్నట్లు సమాచారం. 

బాలీవుడ్ లో ఒకప్పటి బిగ్గెస్ట్ హిట్ మూవీ.. షారుఖ్ కెరీర్ నుమలుపుతిప్పిన సినిమా . అప్పటివరకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షారుఖ్‌ను ఈ మూవీ స్టార్ హీరోను చేసింది. కాగా ఈ సినిమా బాలీవుడ్‌ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా నేటి తరానికి తగ్గుట్టుగా మార్పులు చేసి రీమిక్స్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట. అయితే ఆయ దృష్టిలో ముందుగా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో ఈ సినిమా చేయాలని ఉందట. కాని ఆర్యన్ ఖాన్ సినిమాల్లోకి రావడం కష్టమనే అభిప్రాయానికి వచ్చాడట స్టార్ ప్రోడ్యూసర్. 

అయితే ఇప్పుడు ఆదిత్య చోప్రా ఈ సినిమాను విజయ్‌ దేవరకొండతో తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతం విజయ్‌ క్రేజ్ టాలీవుడ్‌కు సమానంగా బాలీవుడ్‌లోనూ ఉంది. లైగర్‌ ఇక్కడ ఫ్లాప్‌ అయినా.. హిందీ బెల్ట్‌లో బ్రేక్ ఈవెన్‌ దగ్గరి వరకు వెళ్లింది. దాంతో విజయ్‌తో ఈ రీమిక్స్‌ను తెరకెక్కించాలని అనుకుంటున్నాడట. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇక విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషీ సినిమా చేస్తున్నాడు. దాదాపు ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఈమూవీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఇక ఈమూవీ తరువాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నాడు రౌడీ హీరో. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

గీతాగోవిందం తరువాత రౌడీ హరో విజయ్‌కు మరో హిట్టు లేదు. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ రిలీజైన లైగర్‌ డిజాస్టర్‌గా మిగిలింది. అయినా పెద్దగా బాధపడలేదు టీమ్. పూరి జగన్నాధ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అటు పూరి కెరీర్‌లోనూ, ఇటు విజయ్‌ కెరీర్‌లోనూ బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న విజయ్‌ కల.. కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమా చేస్తున్నాడు.