ఎన్నికల ప్రచారంలో విజయ్ దేవరకొండ!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 3, Sep 2018, 12:07 PM IST
vijay devarakonda election campaign
Highlights

హీరో విజయ్ దేవరకొండ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తనే ట్విట్టర్ లో వెల్లడించారు. విజయ్ కి ఎన్నికలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..?

హీరో విజయ్ దేవరకొండ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తనే ట్విట్టర్ లో వెల్లడించారు. విజయ్ కి ఎన్నికలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? అసలు విషయంలోకి వస్తే.. ప్రస్తుతం విజయ్ తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతోన్న 'నోటా' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రచారాన్ని ఈరోజు నుండి మొదలుపెట్టబోతున్నారు.

వచ్చే నెలలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఇప్పటి నుండే సినిమాను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రమోట్ చేయడాన్ని.. ఎన్నికల ప్రచారంలో పోల్చాడు విజయ్. ఇటీవలే 'గీత గోవిందం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ ఇప్పుడు 'నోటా' ప్రమోషన్స్ తో బిజీ కానున్నాడు.

మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం తమిళం నేర్చుకొని అక్కడ సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తమిళ ప్రమోషన్స్ కోసం చెన్నైలో కొన్నాళ్ల పాటు ఉండనున్నారు విజయ్. ఈ సినిమా విడుదలైన తరువాత 'టాక్సీవాలా' సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

loader