రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రతి సినిమాతో ఊహించని అనుభవాల్ని ఎదుర్కొంటున్నాడు. అర్జున్ రెడ్డ్ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే ఆ వేడి సెగ కోలీవుడ్ - బాలీవుడ్ ఇండస్ట్రీలకు గట్టిగానే తాకింది. ఇక గీత గోవిందం సినిమాతో 70కోట్ల కలెక్షన్స్ అందుకోవడంతో మనోడి రేంజ్ సౌత్ లో అయితే గట్టిగానే పెరిగింది. 

అదే క్రేజ్ ను తమిళ్ లో కూడా కొనసాగించాలని ప్రయత్నించిన రెండు సార్లు విజయ్ దెబ్బ తిన్నాడు. మొదటిసారి నోటా సినిమా కోసం దాదాపు కోలీవుడ్ టెక్నీషియన్స్ తోనే పని చేసిన విజయ్ ఆ సినిమా సక్సెస్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ నోటా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

ఇక మొన్న ట్యాక్సీ వాలా సినిమాతో మరో సక్సెస్ అందుకున్న విజయ్ తమిళ్ లోనే కాకుండా కన్నడ - మలయాళం ఆడియెన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేయాలనీ డియర్ కామ్రేడ్ సినిమాతో వచ్చాడు. కానీ ఆ సినిమా తమిళ్ లో మినిమమ్ 3 కోట్లను కూడా వసూలు చేయలేకపోయింది. 

తెలుగులో చాలా వరకు బయ్యర్లు నష్టపోయారు. మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే పరాభాషలో మంచి కథను సెలెక్ట్ చేసుకొని సక్సెస్ అందుకోవాలని అనుకున్న విజయ్  రెండు సార్లు ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు. మరి నెక్స్ట్ సినిమాతో అయినా ఈ రౌడీ స్టార్ మెప్పిస్తాడో లేదో చూడాలి.