జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించిన నోటా సినిమాకి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. విజయవాడకి చాలా రోజుల తర్వాత వచ్చానని, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత ఇప్పుడే వచ్చానని విజయ్ దేవరకొండ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడలో నోటా సినిమా హీరో విజయదేవరకొండ, హీరోయిన్ మెహ్రీన్ కౌర్ సందడి చేశారు. నోటా సినిమా అక్టోబర్ 5వ తేదీన విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగాంగా విజయ్ దేవరకొండ విజయవాడలో జరిగిన పబ్లిక్ మీట్ లో ప్రసంగించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించిన నోటా సినిమాకి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. విజయవాడకి చాలా రోజుల తర్వాత వచ్చానని, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత ఇప్పుడే వచ్చానని విజయ్ దేవరకొండ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయవాడలో అందరికీ ఇష్టమైనవి సినిమా.. రాజకీయమని, నోటా సినిమా, రాజకీయాల్ని కలిపి వస్తున్న పవర్ ఫుల్ జబర్దస్త్ సినిమా అని అన్నారు. 

"ఈ సినిమా ద్వారా మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాని అందిస్తున్నామని చెప్తున్నాను. అక్టోబర్ 5న ఈ సినిమా వస్తుంది. ఇంకా నాలుగే రోజులు ఉంది. థియేటర్‌లో కలుద్దాం. చూద్దాం" అని అన్నారు. మంచి స్క్రిప్ట్‌తో, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో వస్తున్న సినిమా నోటా అని, తమ సినిమాని అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు.

బయట ఉన్నవాళ్ళని చూడలేకపోతున్నానని అంటూ "సారీ.. నెక్స్ట్ టైం ఇంకా పెద్ద హాల్ ఏర్పాటు చేస్తా. ఇంత చిన్న హాల్ సరిపోదు. క్షమాపణ చెప్తున్నాను. అందరు జాగ్రత్తగా వెళ్ళండి" విజయ్ దేవరకొండ అన్నారు.