టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటూ సెన్సేషనల్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. 'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి','గీత గోవిందం' చిత్రాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే రోజులు వచ్చాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అక్టోబర్ 5న విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రాజకీయ నేపధ్యంలో సాగనుంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగా విజయ్ దేవరకొండకి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. సినిమాలు తగ్గించాలనుకుంటున్నానని చెప్పాడు. ''కొత్త కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా దగ్గరకి ఆ తరహా కథలు వస్తున్నాయి. కానీ నేను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను.

2020 వరకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేయాలి. అందుకే కొన్ని సినిమాలు అంగీకరించలేకపోతున్నాను. నాకంటూ కొంత సమయం కూడా ఉండడం లేదు. అందుకే సినిమాలు తగ్గించుకావాలనుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చాడు.