దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోలంటే యాటిట్యూడ్ కే బ్రాండ్ అంబాసర్ లా ఉంటారు. మరి యాటిట్యూడ్ కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన విజయ్ దేవరకొండను ఆయన ఎలా చూపిస్తాడనేది ఊహించడానికే కష్టం. అందుకే విజయ్ దేవరకొండతో పూరి జగన్నాధ్ చేస్తున్న లైగర్ పై పతాక స్థాయిలో ఉన్నాయి. ఈ మూవీలో విజయ్ ఫైటర్ గా కనిపిస్తుండడం మరో విశేషం. 

ఇప్పటికే లైగర్ ప్రచార చిత్రాలు ఫ్యాన్స్ తో పాటు, మూవీ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. లైగర్ మూవీ విడుదల తేదీ కూడా ఫిక్స్ చేశాడు పూరి జగన్నాధ్. సెప్టెంబర్ 9న లైగర్ పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల కానుంది. మూడు నెలల్లో సినిమా షూటింగ్ చుట్టేసే పూరి జగన్నాధ్ లైగర్ కోసం... ఇంత సమయం తీసుకోవడం కొంచెం కొత్తగానే ఉంది. లాక్ డౌన్ కి ముందే పూరి రెండు షెడ్యూల్స్ వరకు పూర్తి చేశాడు. 

ఇక లేటెస్ట్ షెడ్యూల్ పూరి ముంబైలో ప్లాన్ చేశారు. ముంబై షెడ్యూల్ లో పాల్గొనడానికి విజయ్ దేవరకొండ స్పెషల్ ఫ్లైట్ ఎక్కాడు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ స్నాప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ దేవరకొండతో పాటు, నిర్మాత ఛార్మి విజయ్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది.