విజయ్ ఆంటోనీ ఆరోగ్యం విషమం అంటూ పుకార్లు.. ఆసుపత్రి బెడ్ పై నుంచి క్లారిటీ ఇచ్చిన హీరో
విజయ్ ఆంటోని హెల్త్ విషయంలో క్లారిటీ లేక ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. అయితే ఎట్టకేలకు అభిమానులు ఊపిరి పీల్చుకునేలా స్పష్టత వచ్చింది.

సైలెంట్ గా వచ్చిన బిచ్చగాడు చిత్రం తెలుగు తమిళ భాషల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో విజయ్ ఆంటోనికి మంచి క్రేజ్ వచ్చింది. అంతకు ముందు విజయ్ కొన్ని చిత్రాల్లో నటించాడు. కానీ విజయ్ ఆంటోని అంటే ఎవరో చాలా మందికి తెలియదు. బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోని ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.
కొన్ని రోజుల క్రితం విజయ్ ఆంటోని తన తదుపరి చిత్ర షూటింగ్ లో ప్రమాదవశాత్తూ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోని ప్రస్తుతం బిచ్చగాడు 2(పిచైక్కారన్ 2) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
దీనితో విజయ్ ఆంటోనీకి చిత్ర యూనిట్ మొదట మలేషియాలో చికిత్స అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు విజయ్ ఆంటోనీని చెన్నైకి తీసుకువచ్చారు. విజయ్ ఆంటోనీకి తీవ్ర గాయాలు అయ్యాయి అని.. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ ప్రచారం జరిగింది.
దీనితో విజయ్ ఆంటోని హెల్త్ విషయంలో క్లారిటీ లేక ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. అయితే ఎట్టకేలకు అభిమానులు ఊపిరి పీల్చుకునేలా స్పష్టత వచ్చింది. స్వయంగా విజయ్ ఆంటోని తన హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చారు. ఆసుపత్రి బెడ్ పై నుంచే ఈ క్లారిటీ ఇవ్వడం విశేషం. డియర్ ఫ్రెండ్స్.. నేను సేఫ్ గా ఉన్నాను. ప్రస్తుతం కోలుకుంటున్నాను.
మలేషియాలో షూటింగ్ లో నా దవడ, ముక్కుకి తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా నాకు కీలకమైన సర్జరీ విజయవంతంగా పూర్తయింది. నీ అందరితో వీలైనంత త్వరగా నేను మాట్లాడతాను. నేను కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు. ఆసుపత్రి బెడ్ పై థమ్స్ అప్ సింబల్ చూపిస్తున్న పిక్ పోస్ట్ చేశారు.