సంగీత దర్శకుడిగా సౌత్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ అంథోని అప్పుడప్పుడు హీరోగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. బిచ్చగాడు సినిమాతో అతనికి మంచి క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఆ సినిమా కలెక్షన్ల వర్షం గురిపించింది. దీంతో అప్పటినుంచి విజయ్ తెలుగులో కూడా తన సినిమాలను భారీగా రిలీజ్ చేస్తున్నాడు. 

నెక్స్ట్ రోషగాడు అనే సినిమా ద్వారా రానున్నాడు ఈ హీరో. ఈ సినిమాకు సంగీతం కూడా అతనే అందించాడు. ఇక రీసెంట్ గా సినిమాకు సంబందించిన టీజర్ ను విడుదల చేశారు. అందులో విజయ్ ఒక పోలీస్ పాత్రలో కోపంతో చెబుతున్న డైలాగ్ చాలా బాగా ఆకట్టుకుంటోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా తనదైన శైలిలో డైలాగ్స్ చెబుతూ విజయ్ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. 

చూస్తుంటే ఈ సినిమా బిచ్చగాడు రేంజ్ లో హిట్టవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ నుంచి సమాచారమందుతోంది. ఇక నివేత పేతు రాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది. మరి విజయ్ అంథోని ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి.