కోలీవుడ్ స్టార్ హీరో ఇళయథలపతి విజయ్ 64వ సినిమా పనులు కూడా ఊపందుకున్నాయి. గత కొంత కాలంగా నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచాడు. మెర్సల్ - సర్కార్ సినిమాలతో 200కోట్ల మార్కెట్ ను సెట్ చేసుకోవడంతో రాబోయే సినిమాలపై అంచనాలు మరింతగా పెరిగాయి. 

విజయ్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో బిజిలి అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత 64వ సినిమాను యంగ్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమాలో సౌత్ సీనియర్ యాక్టర్ అర్జున్ సార్జా కీలకపాత్రలో నటించనున్నట్లు సమాచారం. 

కోలీవుడ్ లో లో అయితే అర్జున్ విలన్ గా నటించనున్నట్లు టాక్ వస్తున్నప్పటికీ ఇంకా చిత్ర యూనిట్ ఆ రూమర్స్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నా - రష్మిక మందన్నా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.