తమిళ దర్శకుడు.. నయనతార భర్త విఘ్నేష్ శివన్ అందమైన ఫ్యామిలీ ఫోటోస్ ను తన సోషల్ మీడియా పేజ్ లో శేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో కూడా తన పిల్లల ఫేస్ లు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు విఘ్నేష్. 

ప్రస్తుతం హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్. తమ జీవితంలోని అత్యంత అందకరమైన రోజులను అనుభవిస్తున్నారు. దాదాపు 5 ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన నయన్, విఘ్నేష్.. లివింగ్ రిలేషన్ ను మెయింటేన్ చేశారు. ఇక పోయిన ఏడాది పెళ్లి చేసుకున్నఈ స్టార్ కపుల్ నెలల వ్యావధిలోనే సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ఈ జంట తమ కుమారులకు ఏం పేరు పెట్టారో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి కనబరిచారు. ఈక్రమంలో.. తమ కోడుకులకు ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టినట్టు తెలుస్తోంది. 


ఉయిర్ అంటే ప్రపంచం అని.. ఉలగం అంటే జీవితం అని అర్ధం. అయితే వారి పిల్లలు బయట ప్రపంచానికి కనిపించకుండా.. వారి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఇద్దరు స్టార్లు. మీడియా కాని.. సోషల్ మీడియా కాని.. ఫోటో గ్రాఫర్లు కాని ఎంత ప్రయత్నించినా.. పిల్లల ఫోటోలు మాత్రం సాధించలేకపోతున్నారు. అంత పకట్బంధీగా పిల్లల ముఖాలు కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు జంట. రీసెంట్ గా తన భార్య నయన్, పిల్లల కు సబంధించిన ఓ బ్యూటిఫుల్ ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ పేజ్ లో శేర్ చేశాడు విఘ్నేష్. అయితే ఇందులో కూడా తన పిల్లల ముఖాలు కనిపించకుండా..వారి చిన్న చిన్న చేతుల క్యూట్ పిక్ ను మాత్రమే శేర్ చేశాడు. 

View post on Instagram

ఆనందం మన ప్రియమైనవారిలో జరిగే ప్రతిదానితో ముడిపడి ఉంటుంది! ప్రేమ అనేది ఆనందం, ఆనందమే ప్రేమ. అన్నింటికి మించి మీరు కలిగి ఉండే ప్రేమే.. మీకు ఆశీర్వాదం అంటూ.. తన పోస్ట్ కు ట్యాగ్ లైన్ గా రాశాడు విష్నేశ్. ఆమధ్య ఒక సారి నయన్, విగ్నేష్ దంపతులు తమ కవల పిల్లలతో ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దీంతో మీడియా వాళ్ళ కెమెరాలకు పనిచేప్పారు. స్టార్ కపుల్ వెంట పడ్డారు. ఇద్దరూ చెరో బాబుని ఎత్తుకొని కారులోంచి దిగి హడావిడిగా ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళిపోయారు. పిల్లలతో ఈ నయనతార, విఘ్నేష్ కనిపించారు కాని.. వారి ఫేస్ లు మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు జంట. 

View post on Instagram

విఘ్నేష్ శివన్ అజిత్ కుమార్ తో ఏకే 62 సినిమా చేయాల్సి ఉండగా.. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఆ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం , విఘ్నేష్ శివన్ తన నెక్ట్స్ సినిమా లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్‌ తో చేయబోతున్నట్టు కోలీవుడ్ టాక్. అటు నయనతార తమిళంలో చివరిగా అశ్విన్ శరవణన్ తో చేయగా.. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ జంటతా.. జవాన్ సినిమాలో నటిస్తోంది. ఈమూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. జూన్ 2, 2023న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. అట్లీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా.. మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.