దీని తర్వాత కథ తెలుసుకోవాలంటే రెండు గంటలు సినిమా చూడరా ఎదవ అంటూ గమ్మత్తుగా టీజర్ రిలీజైంది.


పెళ్లిళ్లు ,బారసాలలు వంటి శుభకార్యాలకు ఇక మీదట లవ్ ఫెయిల్యూర్ అయిన ఆడవాళ్లు రాకూడదని కొత్త చట్టం అమలులోకి వచ్చింది. తర్వాత... దీని తర్వాత కథ తెలుసుకోవాలంటే రెండు గంటలు సినిమా చూడరా ఎదవ అంటూ గమ్మత్తుగా టీజర్ రిలీజైంది. ఆ సినిమానే “హాట్ స్పాట్”. 

ఓటిటిల వల్ల ప్రత్యేకంగా కలిగిన మేలు ఏమిటంటే..ఎక్కడెక్కడి హిట్ సినిమాలు తెలుగు లో డబ్బింగ్ వెర్షన్స్ వచ్చేస్తున్నాయి. ఇంతకు ముందు పెద్ద స్టార్స్ సినిమాలు మాత్రమే డబ్బింగ్ అయ్యేవి. ఓటిటిలలో పెద్ద, చిన్న సినిమా అని కాకుండా కంటెంట్ బాగుంటే చాలు వ్యూస్ కుమ్మేస్తున్నాయి. దాంతో ఓటిటిలు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకే మ్రొగ్గుచూపుతున్నారు. ఆ క్రమంలో ఈ వారం ఆహా ఓటిటిలో వస్తున్న చిత్రం “హాట్ స్పాట్”.

తమిళంలో రిలీజై మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగుకు అందిస్తున్నారు. ఈ కథ ఇప్పటి యూత్ కు ప్రతిబింబిస్తుందని నమ్మి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. హైపర్ లింక్ లతో కూడిన అంథాలిజీ తరహాలో కథలు సాగుతాయి. కొత్త పాయింట్ తో ఈ సినిమా తీయటమే తమిళంలో విజయవంతం అవటానికి కారణమైంది. డైరక్టర్ ఈ సినిమాలో ఫిక్షనల్ ఫిల్మ్ మేకర్ గా కనిపిస్తారు. ఈ సినిమాలో ప్రస్తుతం సొసైటీ ఎదుర్కొంటున్న కొన్ని క్రిటికల్ ఇష్యూలను స్పృశించారు. సినిమా చూసాక ఆలోచనలో పడిపోతాం. కొన్ని విషయాల్లో మంచి,చేడా అనే డైలమోని కూడిన ప్రశ్నలను మన మైండ్ లో కలిగిస్తుంది. నాలుగు కథలు కూడా ఇండిపెండెంట్ గా ఉన్నా సెంట్రల్ థీమ్ మాత్రం ఒకటే. నైతికత అనేది సబ్జెక్టివ్ ...అది మన ఆలోచనలు, పరిస్దితులును బట్టి మారుతూంటుందని చెప్తారు.



ఇంతవరకు ఏ ఎవరు టచ్ చేయని కోణాన్ని ఈ చిత్రంలో చూపించారు దర్శకుడు విఘ్నేష్ కార్తీక్. ఇది కచ్చితంగా అందరి మనుసులు దోచుకుంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. గౌరి కిషన్, అదిత్య భాస్కర్, కలై అరసన్, అమ్ము అభిరమి, స్యాండీ, సోఫియా, జనని, సుభాష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విఘ్నేష్ కార్తీక్ ఈ చిత్రానికి రచయితగా, దర్శకుడిగా పనిచేశారు.

మోజ్విత్, మొవిహాన్ సమర్పణలో యాంట్స్ టూ ఎలిఫేంట్స్ సినిమాస్ & కో ప్రొడక్షన్‌లో అనీల్ రెడ్డి ఎం, ముని చంద్రా రెడ్డి యన్, ఇందు కుమార్ యం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కచ్చితంగా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు. హాట్ స్పాట్ చిత్రం జూలై 17న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ టీజర్ కూడా చాలా డిఫరెంట్ గా కట్ చేసారు. టీజరే ఇలా ఉంటే సినిమా ఉండబోతోందో అంటున్నారు. మీరూ టీజర్ పై ఓ లుక్కేయండి..ఆ డిఫరెంట్ ఏంటో తెలుస్తుంది. 

YouTube video player