అత్యంత ప్రతిష్టాత్మక పురస్కార కమిటీలో ఇండియన్స్ కి చోటు దక్కింది. బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌కి, నిర్మాతలు ఏక్తా కపూర్‌, తల్లి శోభా కపూర్‌లు సభ్యులుగా ఎంపికయ్యారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సినీ అవార్డు ఏదైనా ఉందంటే అది ఆస్కార్‌ పురస్కారం. ఆస్కార్‌ వస్తే ఇక సినీ కెరీర్‌లో ఆ విభాగంలో తను టాప్‌లెవల్‌ టాలెంట్‌గా భావిస్తారు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక పురస్కార కమిటీలో ఇండియన్స్ కి చోటు దక్కింది. బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌కి, నిర్మాతలు ఏక్తా కపూర్‌, తల్లి శోభా కపూర్‌లు వచ్చే ఏడాది అందించే అవార్డులకు సంబంధించిన `ది క్లాస్‌ ఆఫ్‌ 2021` లో సభ్యులుగా స్థానం దక్కింది. 

Scroll to load tweet…

నటుల కేటగిరిలో విద్యాబాలన్‌కి, నిర్మాతల విభాగంలో ఏక్తా కపూర్‌, శోభాకపూర్‌లకు చోటు దక్కింది. మొత్తం యాభై దేశాలకు చెందిన 395 మంది ఇందులో సభ్యులున్నారు. వారిలో 46శాతం మంది మహిళలకు చోటు కల్పించారు. వారిలో ఇండియాకి చెందిన ఇద్దరుండటం విశేషం. వీరంతా ఆయా విభాగాల్లో ఆస్కార్‌ అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యులుగా ఉంటారు. `తుమ్హారి సులు`, `కహాని` చిత్రాలను పరిగణలోకి తీసుకుని విద్యా బాలన్‌ని, `డ్రీమ్‌ గర్ల్`,`వన్స్ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబయి` చిత్రాలను పరిగణలోకి తీసుకుని ఏక్తా కపూర్‌ని, `ఉడ్తా పంజాబ్‌`, `ది డర్టీ పిక్చర్` చిత్రాలను పరిగణలోకి తీసుకుని శోభా కపూర్‌లను ఎంపిక చేశారు. వీరు ఆస్కార్‌ అవార్డుల సమయంలో ఓట్లు వేసే హక్కుని పొందుతారు. జ్యూరీ ఎంపికలో వీరిది కీలక పాత్ర కానుంది.