ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గా విద్యాబాలన్
ఎంఎస్ సుబ్బులక్ష్మి అంటే తనకు ఎంతో ఇష్టమని విద్యాబాలన్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. తాజాగా మరోసారి ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి తెలియని భారతీయుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి ఎం.ఎస్ సుబ్బులక్ష్మి. తన పాటలతో భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేశారామె. సోమవారం ఆమె 108వ జయంతి.
ఈ సందర్భంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆమెకు నివాళులర్పించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విద్యాబాలన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అవుతోంది(Photographic tribute to M S Subbulakshmi). దీంతో లెజెండరీ సింగర్ బయోపిక్ గురించి మరోసారి చర్చకు వచ్చింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి అంటే తనకు ఎంతో ఇష్టమని విద్యాబాలన్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. తాజాగా మరోసారి ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి లాగే మేకోవర్ అయ్యి కనిపించారు. ఆమె పాత్రలో నటించాలనే కోరికను బయటపెట్టారు.
‘నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఉదయం నిద్ర లేవగానే వినిపించే శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో సుబ్బులక్ష్మి గారి గొంతే వినిపిస్తుంది. ఆమెకు ఇలా నివాళులర్పించడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని విద్యాబాలన్ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు నెటిజన్లు స్పందిస్తూ ఆమె బయోపిక్ గురించి అడుగుతున్నారు. దీంతో మరోసారి ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఇండస్ర్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఇక ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందారు సుబ్బులక్ష్మి.
యష్మి గౌడ అసలు రూపం బట్టబయలు.. బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.