Asianet News TeluguAsianet News Telugu

`డర్టీ పిక్చర్‌` అనుభవాలు పంచుకున్న విద్యా.. ఏం జరిగిందంటే?

గ్లామర్‌ హీరోయిన్‌ సిల్క్ స్మిత జీవితంలోని ఆటుపోట్లని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతోపాటు ట్రెండ్‌ సెట్టర్‌గాని పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమాతో విద్యా బాలన్‌ మోడ్రన్‌ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల ట్రెండ్‌ని క్రియేట్‌ చేశారు. 

vidya balan shared her experiences while starring in the movie dirty picture
Author
Hyderabad, First Published Aug 10, 2020, 1:28 PM IST

విద్యాబాలన్‌.. బాలీవుడ్‌లో విలక్షణ నటిగా రాణిస్తున్న హీరోయిన్‌. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలను తెరలేపిన కథానాయిక. హోమ్లీ గర్ల్‌ గా, గ్లామర్‌ డాల్‌గా మెప్పించిన విద్యా కెరీర్‌ని `డర్టీ పిక్చర్‌` మలుపు తిప్పింది. ఒకానొక దశలో `డర్టీ పిక్చర్‌`కి ముందు విద్యా, ఆ సినిమా తర్వాత విద్యా వేరుగా చెబుతుంటారు. సినిమా `డర్టీ పిక్చర్‌` అయిన విద్యా మాత్రం నటనలో గోల్డ్ అని నిరూపించుకుంది. ఇందులో నటననకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుంది. 

గ్లామర్‌ హీరోయిన్‌ సిల్క్ స్మిత జీవితంలోని ఆటుపోట్లని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతోపాటు ట్రెండ్‌ సెట్టర్‌గాని పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమాతో విద్యా బాలన్‌ మోడ్రన్‌ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల ట్రెండ్‌ని క్రియేట్‌ చేశారు. అయితే ఈ సినిమా చేయడానికి ముందు మాత్రం విద్యాలో చాలా మధనం జరిగిందట. ఈ సినిమా చేయాలా? వద్దా? అనే కోణంలో కన్‌ఫ్యూజన్‌లో పడిందట. 

తాజాగా ఆ విషయాలను పంచుకుంది విద్యా. ఆ చిత్ర దర్శకుడు మిలాన్‌ తనని బాగా నమ్మాడట. ఈ పాత్రకి తాను న్యాయం చేస్తానని గట్టిగా నమ్మాడని, ఆయనకున్న కళాసౌందర్యం కారణంగా ఈ సినిమా బాగానే ఉంటుందని తాను కూడా భావించినట్టు తెలిపింది. తనతోపాటు కెరీర్‌ ప్రారంభించిన ఏక్తా కపూర్‌ దీనికి నిర్మాత కావడంతో మరింత ధైర్యం వచ్చిందని, నేను చేస్తున్నది రైటే అని అనిపించిందని విద్యా పేర్కొంది. కానీ ఈ సినిమాకి ఒప్పుకున్నప్పుడు అనేక విమర్శలు వచ్చాయట. చాలా మంది తనని పిచ్చిపట్టిందా?, ఇలాంటి సినిమా చేస్తున్నావేంటి? నీకున్న ఇమేజ్‌ ఏంటీ? నువ్వు చేస్తున్నదేంటి? అని విమర్శించారట.  

అయితే సినిమా ఒప్పుకోవడానికి ముందు తమ పేరెంట్స్ అభిప్రాయాన్ని తీసుకోగా, వాళ్ళు నీకు ఏది నచ్చితే అది చేయమని ఫ్రీడమ్‌ ఇచ్చారని, దీంతో తాను సొంతంగా నిర్ణయం తీసుకున్నట్టు విద్యా తెలిపింది. అప్పుడు తీసుకున్న తన నిర్ణయం సరైనదే అని సినిమా విడుదల తర్వాత అర్థమైందని పేర్కొంది. 2011లో విడుదలైన ఈ సినిమాలో ఇమ్రాన్‌ హష్మి, తుషార్‌ కపూర్‌, నసీరుద్దీన్‌ షా వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఇది ఉత్తమ నటితోపాటు మేకప్‌ ఆర్టిస్ట్, కాస్ట్యూమ్‌ డిజైన్‌ విభాగాల్లో జాతీయ అవార్డులను అందుకుంది. అనేక అంతర్జాతీయ, జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. 

ఇటీవల విద్యాబాలన్‌ హ్యూమన్‌ కంప్యూటర్‌ `శకుంతలాదేవీ` బయోపిక్‌లో నటించి మెప్పించింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం విద్యా `షెర్నీ` అనే చిత్రంలో నటిస్తుంది. దీనికి అమిత్‌ వి మసుర్కర్‌ దర్శకుడు. 

Follow Us:
Download App:
  • android
  • ios