నందమూరి తారకరామారావు గారి బయోపిక్ టచ్ చేసి ఊహించని రిజల్ట్ ని అందుకున్న బాలకృష్ణ ఇప్పుడు చాలా వరకు సైలెంట్ అయిపోయారు. కథానాయకుడు ఇచ్చిన రిజల్ట్ తోనే చాలా వరకు బయటకు రావడం మానేశారు. ఇక ముహనాయకుడు దెబ్బకు ఎన్టీఆర్ పేరు కూడా ఎత్తడం లేదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ ఎలా ఉన్నా కూడా రిజల్ట్ ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు నటి విద్య బాలన్. దాదాపు 15 ఏళ్ల తరువాత నటించిన తెలుగు సినిమా కావడంతో బయోపిక్ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. కానీ సినిమా ఏ విధంగా డిజాస్టర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

కానీ నటనపరంగా విద్యా బాలన్ కు సినిమా మంచి సంతృప్తిని ఇచ్చినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె వివరణ ఇవ్వడం కరెక్ట్ అని కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే విద్యా బాలన్ తన నటనతో మంచి ఎమోషన్ ని క్రియేట్ చేసింది. కానీ సినిమాలో అసలు కథ మిస్ అవ్వడంతో రిజల్ట్ లో తేడా కొట్టీసింది.