రీమేక్ కురెడీ అవుతున్న విక్టరీ వెంకటేష్ చంటీ సినిమా, హీరో ఎవరంటే..?
కొన్ని క్లాసిక్ సినిమాలు ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. వాటిని రీమేక్ చేయాలన్నా.. సీక్వెల్ తీయాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. అలాంటి సినిమానే చంటి. ఆ సినిమాను మరోసారి తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట మేకర్స్.. అసలు అది సాధ్యమేనా..?

కొన్ని క్లాసిక్ సినిమాలు ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. వాటిని రీమేక్ చేయాలన్నా.. సీక్వెల్ తీయాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. అలాంటి సినిమానే చంటి. ఆ సినిమాను మరోసారి తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట మేకర్స్.. అసలు అది సాధ్యమేనా..?
ఫిల్మ్ ఇండస్ట్రీలోఎవర్ గ్రీన్ సినిమాల లిస్ట్ లో చంటీ పక్కాగా ఉంటుంది. ఈమూవీ ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఎన్నిసార్లు చూసినా.. బోర్ కొట్టడం అనే మాట ఉండదు. అటువంటి సినిమాకు సీక్వెల్ కాని.. రీమక్ కాతీ చేయడం సాహసమనేచెప్పాలి. ఇప్పటికే అలాంటి కొన్నిసినిమాలు టచ్ చేసి.. దెబ్బతిన్నారు మేకర్స్.. కాకపోతే.. ఈమధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ గట్టిగా నడుస్తుంది. అలానే చంటీసినిమాను రీ రిలీజ్ చేస్తే..ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి చూసే అవకాశం ఎక్కువగా ఉంది. కాని ఈమూవీని రీమేక్ చేస్తారన్న వార్త మాత్రమే గట్టిగా వినిపిస్తోంది.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నాడు హీరో వెంకటేష్. ఎలాంటి పాత్ర అయినా అవలీలగాచేయగల వెంకీ.. సినిమాలు తప్పించి.. ఇతర పార్టీలు, గొడవలకుదూరంగా ఉంటుంటారు. వెంకటేష్ కెరీర్ర్లో వచ్చినటువంటి చాలా సినిమాల్లో చంటి మూవీ చాలా స్పెషల్. ఈ సినిమాలో వెంకటేష్ అమాయక పాత్రలో ఒదిగిపోయారు అని చెప్పవచ్చు. ఈ సినిమా అప్పట్లో ఒక క్లాసికల్ మూవీ గా మిగిలిపోయింది. అలాంటి ఈ చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేయాలని చూస్తున్నారట కొంత మంది మేకర్స్.
అయితే ఈసినిమా రీమేక్ చేస్తే సక్సెస్ అవుతుందా అన్న అనుమానాలు వ్యాక్తం అవుతున్నాయి. ఒక వేళ రీమేక్ చేసినా.. హీరోగా ఎవరిని తీసుకోవాలి.. వెంకటేష్ అయితే బాగోదు..ఏ హీరో చేసినా.. వెంకీ నటననుమరిపించగలడా అనేది ప్రశ్న. చంటి సినిమాలో వెంకటేష్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలో వెంకటేష్ నటనే చాలా ప్లస్ అయిందని చెప్పవచ్చు. అలాంటి ఈ సినిమాని ప్రస్తుతం ఒక యంగ్ హీరో తో చేయాలని ఆలోచిస్తున్నారట.
అయితే ఈమూవీని టచ్ చేయడానికి కాస్త వెనగకడుగు వేస్తున్నారట మేకర్స్. వెంకటేష్ క్యారెక్టర్ ను మించి ఆయనను మరిపించే నటుడు కావాలి... అది ఎవరికి సాధ్యంఅన్న అనుమానాలువ్యాక్తం అవుతున్నాయి. సినిమా నటన విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు అనేది మాత్రం బయటకు రాలేదు కానీ సినిమా రీమేక్ చేస్తారు అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు చంటి పేరుమీద చాలా సినిమాలే వచ్చినప్పటికీ వెంకటేష్ నటించిన చంటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వెంకటేష్ చంటి సినిమాను ఎవ్వరూ రీమేక్ చేసినా ప్రస్తుతం అంతటి గుర్తింపు తెచ్చుకోలేరనే చెప్పాలి.