Asianet News TeluguAsianet News Telugu

కరోనా కాకుండా ‘రాధేశ్యామ్‌’ కు కొత్త సమస్య?

మొత్తానికి దాదాపు షూటింగ్ పది రోజులు మినహా పూర్తైంది అన్నారు. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఇప్పుడే పడింది. 
 

Vfx problem for Prabhas Radhe Shyam jsp
Author
Hyderabad, First Published May 5, 2021, 2:02 PM IST

కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడుతున్నట్లుగానే సినిమాపై బాగా పడిన సంగతి తెలిసిందే. షూటింగ్ లు చాలా భాగం ఆగిపోయాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఇలా అర్దాంతరంగా షూటింగ్ లు ఆపటం పెద్ద సమస్యగా మారింది. కానీ తప్పటం లేదు. తాజాగా కరోనా ఎఫెక్ట్ ‘రాధేశ్యామ్’ షూటింగ్ పై కూడా పడింది. షూటింగ్ ఆగింది. అసలు మొదట నుంచే ఈ చిత్రం షూటింగ్  అనుకున్నట్లుగా జరగలేదు. ఆగి..మొదలై..ఆగి అన్నట్లు సాగింది. సరే మొత్తానికి దాదాపు షూటింగ్ పది రోజులు మినహా పూర్తైంది అన్నారు. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఇప్పుడే పడింది. 

ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ ప‌నులు సరిగ్గా జ‌ర‌గ‌డం లేద‌ని తెలుస్తోంది‌.  ఎనభైల నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. దాంతో చాలా ఖర్చు పెట్టి సెట్స్ వేశారు. ఈ క్రమంలో ఆ కాలం నాటి వాతావరణం తేవటానికి సీజీ పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డాల్సివ‌స్తోంది. అందుకు బోలెడు అడ్వాన్స్ లు ఇచ్చి... సీజీ వర్క్ ని చాలా కంపెనీల చేతుల్లో పెట్టారు. కానీ..కరోనా దెబ్బతో ఆ కంపెనీలలో పనులేమీ జరగటం లేదు. ఏమీ అనటానికి కూడా లేదు. కంపెనీ వాళ్లు కూడా  స‌మ‌యానికి వీఎఫ్ఎక్స్ పూర్తి కావ‌డం క‌ష్ట‌మ‌ని తేల్చి చెప్పాసారట..దాంతో  ఇప్పుడు రాధే శ్యామ్ టీమ్ ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ లో పడిందిట.  

  ప్రభాస్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ‘జిల్‌’ఫేమ్‌ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్‌’పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తామంటూ, గత కొంతకాలంగా నిర్మాతలు చెబుతూనే ఉండగా, రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.  

ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందిస్తుండగా, మనోజ్‌ పరమహంస తన కెమెరా పనితనాన్ని చూపెట్టనున్నారు. సచిన్‌ ఖడేకర్‌, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీశర్మ, కృనాల్‌ రాయ్‌ కపూర్‌ ఇతర పాత్రల్లో నటిస్తుండగా, కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం! జూలై 30న చిత్రాన్ని విడుదల చేస్తామని తేదీని కూడా ప్రకటించినా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక పెద్ద చిత్రాల విడుదల వాయిదా పడుతుండగా, ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రాలేదు.  

Follow Us:
Download App:
  • android
  • ios