పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ వంటి పెద్ద హీరో సినిమా ప్రకటిస్తే చాలు ఆ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు.. చర్చలు మూమలుగా ఉండవు. అందులోనూ రాజకీయాల కారణంగా చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ‘వకీల్‌సాబ్‌’తో రీఎంట్రీ ఇచ్చి పెద్ద హిట్ కొట్టేసాడు.  ప్రస్తుతం పవన్‌-రానా ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. మలయాళీ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కు రీమేక్‌ అది. ఈ చిత్రానికి సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ తన 27వ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే..  ‘హరిహర వీరమల్లు’ టైటిల్ తో రూపొందే ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ విషయం వినిపిస్తోంది. 

మొగల్ సామ్రాజ్యం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చార్మినార్, ఎర్రకోటతో పాటు మొగలాయీల సామ్రాజ్యపు ప్రాంగణాన్ని నిర్మించబోతున్నారు. పూర్తిగా సెట్స్ లోనే నిర్మితమవుతున్న ఈ సినిమాకి వీఎఫెక్స్ ఎఫెక్ట్స్ హైలెట్ గా నిలవబోతున్నాయని, ఆ గ్రాఫిక్ వర్క్ కోసమే దాదాపుగా 50 కోట్లు ఖర్చుపెడుతున్నారని చెప్పుకుంటున్నారు. చాలావరకు గ్రీన్ మ్యాట్ లోనే చిత్రీకరణ జరిగిపి వీఎఫెక్స్ లో అన్ని యాడ్ చేస్తారట. 

హరిహర వీరమల్లు వీఎఫెక్స్ పనులను ఇప్పటికే ఓ కంపెనీకి అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఆ వీఎఫెక్స్ వర్క్ లేట్ అవుతున్నందునే క్రిష్ ఈ సినిమాని 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పుతున్నారు కానీ కష్టమే అంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ అంటే దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పలు భాషల్లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు మేకర్స్.