NTR: కలిసారు అంతే...ఎన్టీఆర్ ఆ డైరక్టర్ తో చెయ్యటం లేదు
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. రికార్డు స్టాయిలో కలెక్షన్స్ రాబట్టి రూ. 1200 కోట్ల క్లబ్‌లోకి చేరింది.
ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో ఓ పెద్ద డైరక్టర్ తో కలిసి మాట్లాడితే ఖచ్చితంగా వారిద్దరి మధ్యా ఓ ప్రాజెక్టు సెట్ కాబోతోందనే వార్తలు వస్తాయి. అందుకే దాదాపు తాము కలిసే లేదా తమను కలిసే డైరక్టర్స్, నిర్మాతల విషయంలో చాలా అప్రమత్తతో ఉంటారు హీరోలు. డిస్కషన్స్ జరిగినా బయిటకు రానివ్వవు. మెటీరియలైజ్ అయ్యేదాకా ఆ ప్రాజెక్టు గురించి పొరపాటున కూడా నోరు జారరు. అయితే ఒక్కోసారి మీడియాకు కొన్ని మేటర్స్ లీక్ అయ్యిపోతూంటాయి. అలా ఓ స్టార్ డైరక్టర్ తో ఎన్టీఆర్ సినిమా అనుకున్నారు అందరూ..కానీ అలాంటిదేమీ లేదని ఇప్పుడు తెలిసింది. ఎవరా డైరక్టర్..ఏమా కథ...?
వివరాల్లోకి వెళితే....జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. రికార్డు స్టాయిలో కలెక్షన్స్ రాబట్టి రూ. 1200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే తన తదుపరి చిత్రాలపై ఆచితూచి అడుగు వేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్, కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
మరోపక్క ఎన్టీఆర్, తమిళ దర్శకుడు వెట్రిమారన్ కాంబోలో ఓ సినిమా రూపొందనుందనే టాక్ మీడియాలో మొదలైంది. అయితే ఇటీవల ఎన్టీఆర్‌ను వెట్రిమారన్ కలిసి ఓ కథను వినిపించారనే వార్త ఇప్పుడు మొదలైంది. సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివాసల్’ తెరకెక్కుతోంది. అయితే అటువంటిదేమీ లేదని తెలుస్తోంది. ఎప్పుడో యేడాది క్రితం ..ఎన్టీఆర్, వెట్రిమారన్ కలిసారని, అప్పుడు కూడా స్టోరీ లైన్ ఏమీ చెప్పలేదని, ఇప్పట్లో వెట్రిమారన్ తో సినిమా ఏమీ లేదని, కేవలం రూమరే అంటున్నారు. అయితే వెట్రిమారన్, ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా అంటే ఖచ్చితంగా మంచి క్రేజ్ క్రియేట్ అవుతుందనటంలో సందేహం లేదు. అసురన్ వంటి సినిమా చేసిన వెట్రిమారన్ ..ఎన్టీఆర్ అద్బుతం క్రియేట్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.