ప్రముఖ సినీ నటి విద్యా సిన్హా(71) కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఆమె ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు.

1947, నవంబర్ 15న పుట్టిన ఆమె తన 18వ ఏట మోడల్ గా కెరీర్ ని మొదలుపెట్టింది. ఆమె నటించిన తొలిచిత్రం 'రాజా కాక'. కిరణ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విద్యాకు మంచి పేరు తీసుకొచ్చింది.

'రజనీగంధ' ఆమె కెరీర్ లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆమె 1986లో సినిమాలకు దూరమయ్యి ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఆమె నటించిన చివరి సినిమా 'బాడీగార్డ్'. ఇందులో సల్మాన్ హీరోగా నటించారు.