సీనియర్ హీరో వెంకటేష్ సినిమాలను మీడియం బడ్జెట్ తో తెరకెక్కిస్తుంటారు. కుర్ర హీరో నాగచైతన్య సినిమాలకు పదిహేను కోట్లకు మించి ఖర్చు పెట్టరు. అలాంటిది వీరిద్దరూ కలిసి చేస్తోన్న సినిమాకు మాత్రం ఏకంగా యాభై కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్లు సమాచారం.

మల్టీస్టారర్ హీరోలు ఉన్నారు కాబట్టే ఇంత ఖర్చు కాలేదట. సినిమాలో భారీ యాక్షన్ సీన్లు ఉంటాయట. దాని కోసం కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు అరవై రోజులు పాటు టాకీ కోసం అవసరం పడితే.. యాక్షన్ సీన్ల కోసం మరో అరవై రోజుల పాటు చిత్రీకరించారట.

కాశ్మీర్ లో వెంకీ ఆర్మీ సీన్లు హైక్వాలిటీతో ఉండాలని ఎక్కువగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో వెంకీ సినిమాకి కానీ, చైతు సినిమాకి కానీ యాభై కోట్లు ఖర్చు చేయడం అంటే అది ఈ సినిమా కోసమేనని చెబుతున్నారు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తయింది.

ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని యాక్షన్ సీన్లు తీస్తున్నారు. ఇవి కాకుండా ఒకట్రెండు పాటలు చిత్రీకరిస్తే పని పూర్తైపోతుంది. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు షురూ చేయనున్నారు. పీపుల్స్ మీడియాతో కలిసి సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.