ఎఫ్3 ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న సోనీ లివ్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది. ఇక ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ బుల్లితెరపై పండనుంది.
దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్2 చిత్రంతో భారీ హిట్ కొట్టారు. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్2 విన్నర్ గా నిలవడంతో పాటు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. భార్యాబాధితులుగా వెంకీ, వరుణ్ పోటీపడి ఫన్ పండించారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్3 తీసుకువచ్చారు. సమ్మర్ కానుకగా మే 27న ఎఫ్3 విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఎఫ్3 చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పెద్ద చిత్రాల కారణంగా వసూళ్లు కోల్పోయింది.
సర్కారు వారి పాట ఇంకా థియేటర్స్ లో ఉండడంతో పాటు ఎఫ్3 తర్వాత విడుదలైన విక్రమ్, మేజర్ భారీ హిట్స్ గా నిలిచాయి. ఈ కారణంగా ఎఫ్3 రికార్డు వసూళ్లు దక్కించుకునే ఛాన్స్ కోల్పోయింది. మొత్తంగా ఎఫ్3 చెప్పుకోదగ్గ వసూళ్లతో బయటపడింది. దాదాపు ఎఫ్2 లో నటించిన క్యాస్ట్ తో అనిల్ రావిపూడి ఎఫ్3 తెరకెక్కించారు. వెంకీ(Venkatesh), వరుణ్, రాజేంద్ర ప్రసాద్ తో పాటు హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్ లను కొనసాగించారు. అదనంగా సునీల్, సోనాల్ చౌహాన్ లను తీసుకున్నారు.
థియేటర్స్ లో విడుదలైన ఆరు వారాలు దాటిపోగా ఓటీటీ విడుదల తేదీ ప్రకటించారు. ఎఫ్3 మూవీ (F3 Movie)డిజిటల్ రైట్స్ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జులై 22 నుండి స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ విడుదల చేయనున్నారు. కాబట్టి త్వరలో బుల్లితెరపై వెంకీ, వరుణ్ (Varun Tej)నాన్ స్టాప్ ఫన్ పంచనున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందించారు.