‘జెర్సీ’ మూవీ నాదే.. నానికి షాకిచ్చిన వెంకీ.. అలా జరిగి ఉంటేనా.!
నేచురల్ స్టార్ నాని నటించిన స్టోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ మూవీపై వెంకీ షాకింగ్ న్యూస్ చెప్పారు. తాజాగా వీరిద్దరూ మూవీ ప్రమోషన్స్ కోసం కలిసి చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
నేచురల్ స్టార్ నాని (Nani)- మృణాల్ ఠాకూర్ నటించిన బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ‘హాయ్ నాన్న’ (Hai Nanna) రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే నాని ఈ చిత్రాన్ని ఎంతలా ప్రమోట్ చేయాలో అంత చేశారు. పలు ఇంటర్వ్యూలో, ఈవెంట్లకు హాజరవుతూ సినిమాపై హైప్ తీసుకొచ్చారు. ఆడియెన్స్, ఫ్యాన్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కరోజులో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఫలితం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రమోషన్స్ లో భాగంగా నాని తాజాగా విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati)తో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా వెంకీ నానికి షాకింగ్ న్యూస్ చెప్పారు. నాని నటించిన ‘జెర్సీ’ (Jersey) కథ ముందు తనదగ్గరకే వచ్చిందని రివీల్ చేశారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. నేను సినిమా కోసం కూడా చాలా వర్క్ చేశాను. ఆ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని అప్పుడే ఊహించనని చెప్పుకొచ్చారు. ఆ చిత్రంలో చేసేందుకు ప్రయత్నించాను కానీ కుదరలేదని చెప్పారు. దీంతో నాని ఆశ్చర్యపోయారు. మరోవైపు క్రికెట్ అభిమాని వెంకీ ఈ సినిమా చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
ఇక నాని మాట్లాడుతూ.. ‘జెర్సీ’ మూవీ రిలీజ్ తర్వాత ఫస్ట్ వెంకీ దగ్గర నుంచే మెసేజ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. క్రికెట్ ను ఎంతో ఇష్టపడటం, క్రికెట్ యాంగిల్ కావడంతో మీదగ్గరు చేరిందని నాని చెప్పుకొచ్చారు. ఏదైనా ‘జెర్సీ’ రిజల్ట్ పై ఇద్దరూ సంతోషం వ్యక్తం చేశారు. నాని చిత్రాల్లో అభిమానులు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో ఇదొకటి కావడం విశేషం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా మెప్పించారు.
డిసెంబర్ 7న (రేపు) హాయ్ నాన్న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. శౌర్యూవ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. బేబీ కియారా ఖన్నా, శ్రుతి హాసన్, ప్రియదర్శి, జయరామ్ కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఇక వెంకీ దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘సైంధవ్’ (Saindhav) చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.