విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సురేష్ బాబు నిర్మాత. గురువారం రోజు మూవీ మొఘల్ రామానాయుడి జయంతి. ఈ సందర్భంగా వెంకటేష్ తన తండ్రి, నాగ చైతన్యతో కలసి ఉన్న అరుదైన ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. 

ఈ ఫొటోలో చిన్న పిల్లాడిగా ఉన్న చైతుకు వెంకటేష్ కేక్ తినిపిస్తున్నాడు. పక్కనే రామానాయుడు కూడా ఉన్నారు. వెంకటేష్ తన తండ్రి గురించి ఎమోషనల్ గా కామెంట్స్ చేశాడు. మీరు మాతో ఉంటే చాలు.. మీ కలల్ని నిజం చేస్తాం నాన్న. మీరు దూరం కావడం మాకు అతిపెద్ద లోటు. హ్యాపీ బర్త్ డే అని వెంకీ పోస్ట్ చేశాడు. 

ఇదిలా ఉండగా వెంకటేష్, నాగ చైతన్య కలసి నటించడం నాన్నగారి కల అని సురేష్ బాబు పేర్కొన్న సంగతి తెలిసిందే. వెంకీ మామ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ రైస్ మిల్ ఓనర్ గా, చైతు ఆర్మీ మ్యాన్ గా నటిస్తున్నారు.