విక్టరీ వెంకటేష్ తన రెండో కూతురు పెళ్లి చేశాడు. గతేడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ జరగ్గా, తాజాగా సింపుల్‌గా మ్యారేజ్ వేడుకని పూర్తి చేశారు.
టాలీవుడ్ స్టార్ వెంకటేష్ రెండో కూతురు పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. వెంకీ సెకండ్ డాటర్ మ్యారేజ్ విజయవాడకి చెందిన డాక్టర్ కొడుకు నిశాంత్‌తో శుక్రవారం జరిగింది. పూర్తి ప్రైవేట్ మ్యానర్‌లో ఈ వివాహ వేడుక జరగడం విశేషం. వీరి పెళ్లి వేడుకకి రామానాయుడు స్టూడియో వేదికయ్యింది. రాత్రి 9.36గంటలకు హవ్యవాహిని మెడలో మూడు ముళ్లు వేశాడు నిశాంత్. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు, బడా ఫ్యామిలీలో దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి. కానీ వెంకటేష్ తన కూతురు వివాహం చాలా సింపుల్‌గా, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో చేయడం ఆశ్చర్య పరుస్తుంది.

ఇక పెళ్లి కొడుకు విజయవాడకి చెందిన డాక్టర్ పాతూరి వెంకటేరమారావు, డా అరుణల కుమారుడు. గతేడాది అక్టోబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. దానికి చిరంజీవి, మహేష్ బాబు, నాగచైతన్య వంటి కొందరు సెలబ్రిటీలు సందడి చేశారు. మ్యారేజ్‌లో మాత్రం ఫ్యామిలీ వరకు పరిమితమయినట్టు తెలుస్తుంది. ఇందులో దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ పాల్గొన్నారని సమాచారం. కానీ అధికారికంగా కేవలం పెళ్లికి సంబంధించిన రెండు ఫోటోలనే విడుదల చేయడం గమనార్హం.
లెజెండరీ నిర్మాత రామానాయుడు రెండో కుమారుడైన వెంకటేష్‌కి, నీరజల దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు అర్జున్ ఉన్నారు. ఇప్పటికే పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో వివాహం జరిగింది. ఇప్పుడు రెండో కూతురు మ్యారేజ్ కూడా అయిపోయింది. మరో కూతురు వివాహం చేస్తే వెంకీకి బాధ్యత తీరిపోతుందని చెప్పొచ్చు. ఇక అర్జున్‌ని ఆయన హీరోని చేసే అవకాశం ఉంది. తన వారసత్వంగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.
వెంకటేష్ ఈ సంక్రాంతికి `సైంధవ్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు సమాచారం. దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతున్నట్టు తెలుస్తుంది. కూతరు పెళ్లి కారణంగానే ఆలస్యమయినట్టు సమాచారం.
