Asianet News TeluguAsianet News Telugu

#Saindhav:'సైంధవ్' కలెక్షన్స్ అంత డ్రాపా? రెండో రోజుకే...

పండగ సీజన్ లో రెండో రోజుకే అంత స్లో అవ్వటం ఊహించని పరిణామం. దాంతో బ్రేక్ ఈవెన్ అవ్వటం కష్టం అంటున్నారు. చివరకు సినిమా లో చెప్పిన ఇంజక్షన్ కాస్ట్ 17 కోట్లు అయినా ఫైనల్ రన్ కు తెచ్చుకుంటాడా అంటున్నారు. 

Venkatesh Saindhav movie collections on the downhill? JSP
Author
First Published Jan 15, 2024, 11:39 AM IST


విక్టరీ వెంకటేష్ నటించిన 75వ సినిమా సైంధవ్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 13న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసారు. మిగతా భాషల సంగతి ఎలా ఉన్నా తెలుగులో మాత్రం రిలీజైన మార్నింగ్ షోకే డివైడ్ టాక్ వచ్చేసింది.
 
సంక్రాంతి సినిమాల పోటితో  ఓపెనింగ్స్ పరంగా ఇతర సినిమాల ఇంపాక్ట్ వలన బాగా తగిలింది ఈ సినిమాకు .  దాంతో అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోలేక పోయింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను, మొత్తం మీద 2.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా సినిమా… 3.03CR(5.45CR~ Gross) వచ్చింది. ఇక రెండో రోజుకే అంటే ఆదివారం డ్రాప్ స్టార్ట్ అయ్యి డిస్ట్రిబ్యూటర్స్ ని కంగారు పెట్టింది. రెండో రోజు కేవలం  2.36 cr నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చింది. పండగ సీజన్ లో రెండో రోజుకే అంత స్లో అవ్వటం ఊహించని పరిణామం. దాంతో బ్రేక్ ఈవెన్ అవ్వటం కష్టం అంటున్నారు. చివరకు సినిమా లో చెప్పిన ఇంజక్షన్ కాస్ట్ 17 కోట్లు అయినా ఫైనల్ రన్ కు తెచ్చుకుంటాడా అంటున్నారు. 
  
ఈ చిత్రం టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 25 కోట్లు అంటే ఈ సినిమా కు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే... సుమారు రూ. 26 లేదా 27 కోట్లు కలెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయి. 'సైంధవ్'ను కొన్ని ఏరియాలలో వెంకటేష్ సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.   

వెంకటేష్ చేసిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు యాక్షన్ చిత్రాలు కాగా.. ఎఫ్‌ 3, ఓరి దేవుడా ఫన్ ఓరియెంటెడ్ చిత్రాలు. అన్ని సినిమాలు వెంకీమామకు హిట్టుగానే నిలిచాయి. వెంకీ మామ క్లాస్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తూ హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నాడు. అలాంటి వెంకటేష్ శైలేష్ కొలనుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. హిట్ ఫ్రాంచైజీలతో అందరినీ మెప్పిస్తున్న శైలేష్‌ కొలను ఇప్పుడు వెంకీమామతో సైంధవ్ అంటూ వచ్చాడు.  

'సైంధవ్' సినిమాలో వెంకటేష్ సరసన 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. వెంకీ భార్యగా, ఓ పాపకు తల్లిగా మనోజ్ఞ క్యారెక్టర్ చేశారామె. అభినయానికి ఆస్కారమున్న పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటించినట్లు దర్శక - నిర్మాతలు తెలిపారు. మూడేళ్ల విరామం తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ నటించిన తెలుగు చిత్రమిది. ఆమె కాకుండా సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. సుశాంత్ 'చిలసౌ', విశ్వక్ సేన్ 'హిట్' సినిమాల ఫేమ్ రుహానీ శర్మ డాక్టర్ రోల్ చేశారు. ఆమె పాటు ఆండ్రియా జెరెమియా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios