ఈ ఏడాది మొదట్లో F2 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఆయన అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వెంకీ మామ సినిమాతో ఈ సీనియర్ హీరో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో నాగ్ చైతన్య కూడా నటిస్తున్నాడు. 

ఇక ఈ ప్రాజెక్ట్ తరువాత వెంకటేష్ మరో ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తేవడానికి ప్లాన్ చేస్తున్నాడు. వెంకీ మామ రిలీజ్ అనంతరం త్రినాధ్ రావ్ నక్కిన చెప్పిన ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడానికి సిద్దమవుతున్నాడు. అయితే ఆ సినిమాలో వెంకటేష్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్లు సమాచారం. కామెడీతో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. 

వీలైనంత త్వరగా సినిమాను మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు టాక్. అయితే వెంకటేష్ త్రివిక్రమ్ తరుణ్ భాస్కర్ లతో కూడా సినిమా చేయాలనీ ముందే అగ్రిమెంట్ సెట్ చేసుకున్నాడు. మరి ఆ ప్రాజెక్టులను ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.