`నారప్ప` సినిమా విడుదలపై సస్పెన్స్ కి తెరపడింది. ఎట్టకేలకు ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. అంతేకాదు రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించారు. 

విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న `నారప్ప` సినిమా విడుదలపై సస్పెన్స్ కి తెరపడింది. ఈ సినిమా థియేటర్‌లోనే అని నిర్మాతలు చెప్పడం, ఓటీటీలో వస్తుందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడం ఇలా గత కొన్ని రోజులుగా నడుస్తుంది. తాజాగా సస్పెన్స్ కి తెరపడింది. సినిమాని ఎట్టకేలకు ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. అంతేకాదు రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించారు. ఈ నెల(జులై) 20న సినిమాని అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. 

ఇక ఈ సినిమాకి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, వెంకటేష్‌ సరసన ప్రియమణి నటిస్తుంది. సురేష్‌ ప్రొడక్షన్‌, వీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇది తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొంది బ్లాక్‌ బస్టర్‌ అయిన `అసురన్‌`కి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. ఆ చిత్ర నిర్మాత కళైపులి ఎస్‌ థాను తెలుగు రీమేక్‌లోనూ భాగమయ్యారు. అనంతపురం బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా సాగుతుంది. 

ఈ విషయాన్ని వెల్లడిస్తూ హీరో వెంకటేష్‌ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, `నా అభిమానులు, శ్రేయోభిలాషులు మా సినిమా `నారప్ప`ని చూసేందుకు ఈగర్ గా వెయిట్‌ చేస్తున్నారు. నాకు ఎక్స్ ట్రా మైల్‌నిచ్చే ఈ సినిమాపై మీకున్న ప్రేమ చాలా ఎక్కువ. మీ ప్రేమ ఇలానే ఇంకా పెరుగుతుందని భావిస్తున్నా. మీ సౌలభ్యం, భద్రతని దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రైమ్‌లో విడుదల చేస్తున్నాం` అని తెలిపారు.

Scroll to load tweet…

 ప్రైమ్‌లో విడుదల సందర్భంగా నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ, `టాలెంటెడ్‌ నటీనటులు, అత్యంత క్రియేటివిటీ కలిగిన టెక్నీషియన్లతో పనిచేయడం ఉత్తేజకరమైన అనుభవం. `నారప్ప` కథ నా మనసుకి దగ్గరైన కథ. అంతేకాదు ఇది మొత్తం వ్యవస్థపై సామాజిక వ్యాఖ్యానాన్ని కూడా వివరిస్తుంది. సినిమా విడుదల కావడమనేది ఊపిరి పీల్చుకునే విషయం. గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌ కలిగిన ప్రైమ్‌లో విడుదల కావడం గౌరవంగా భావిస్తున్నా. ఈ యాక్షన్‌ ప్యాక్డ్ చిత్రాన్ని అందరు చూసి ఆనందిస్తారని భావిస్తున్నా` అని తెలిపారు.