విక్టరీ వెంకటేష్‌ రీమేక్‌లు చేసి స్టార్‌ హీరో అయ్యాడు. ఇప్పుడు ఆయన నటించిన మూవీ హాలీవుడ్‌లోకి వెళ్తుందట. అక్కడ రీమేక్‌కి ప్లాన్‌ చేస్తున్నారట.  

ఒకప్పుడు ఏ చిత్ర పరిశ్రమలోనైనా రీమేక్‌ హవా సాగింది. ఒక భాషలో విజయం సాధించిన మూవీస్‌ ఇతర భాషల్లోరీమేక్‌ చేసి హిట్లు అందుకున్నారు. అలా హిట్లు కొట్టి స్టార్‌అయిన హీరోలున్నారు. అయితే ఓటీటీలు వచ్చాక రీమేక్‌ ల జోరు తగ్గింది. ఆయా భాషల్లోనే ఓటీటీలో ఆ సినిమాలను చూస్తున్నారు. దీంతో రీమేక్‌ ల జోరు తగ్గింది. చాలా రేర్‌గానే రీమేక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు వెంకటేష్‌ మూవీ సంచలనం సృష్టిస్తుంది. ఏకంగా అది హాలీవుడ్‌ లో రీమేక్‌ కాబోతుంది. 

వెంకటేష్‌ మంచి విజయాన్ని అందించిన మూవీ `దృశ్యం`. ఇది మలయాళ మూవీకి రీమేక్‌. అంతేకాదు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ రీమేక్‌ అయ్యింది. అన్నిచోట్ల సక్సెస్‌ అయ్యింది. దీనికి సీక్వెల్‌ కూడా వచ్చి ఆదరణ పొందింది. తెలుగులో వెంకటేష్‌ రీమేక్‌ చేసి హిట్‌ కొట్టాడు. సీక్వెల్‌ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. 

`దృశ్యం`ని ఇప్పుడు హాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారట. ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీని హాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీన్ని ఇతర దేశాల్లోకి తీసుకెళ్లాలని పనోరమా స్టూడియోస్‌ భావించారు. వాళ్లు గ్లోబల్‌రీమేక్‌ రైట్స్ తీసుకున్నారు. ఇప్పటికే కొరియన్‌ భాషలో ప్రకటించారు. ఇప్పుడు హాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారట. గల్ఫ్ స్ట్రీమ్, జోట్‌ ఫిల్మ్స్ వారితో కలిసి హాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారట. ఇదే నిజమైతే హాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్న తొలి ఇండియన్‌ మూవీగా `దృశ్యం` నిలుస్తుందని చెప్పొచ్చు. మరి దీనికి దర్శకత్వం ఎవరు చేస్తారు? కాస్టింగ్‌ డిటెయిల్స్ రావాల్సి ఉంది. మాతృకని జీతూ జోసెఫ్‌ రూపొందించిన విషయం తెలిసిందే.