Asianet News TeluguAsianet News Telugu

మాజీ పోలీస్ అధికారిగా వెంకీ.. సంక్రాంతి బరిలో అంటూ మరోసారి క్లారిటీ

వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఈ వీడియోలో తెలిపారు. వెంకీ ఎక్స్ కాప్.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి.. భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. 

Venkatesh gives entry into anil ravipudi movie shoot dtr
Author
First Published Aug 14, 2024, 10:29 PM IST | Last Updated Aug 14, 2024, 10:29 PM IST

విక్టరీ వెంకటేష్ చివరగా నటించిన సైంధవ్ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఎందుకనో వెంకీకి ఇటీవల యాక్షన్ చిత్రాలు కలిసి రావడం లేదు.  వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో అనౌన్స్ చేశారు. షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. 

ఇప్పటి వరకు వెంకటేష్ లేకుండా షూటింగ్ చేస్తూ వచ్చారు. తాజాగా వెంకటేష్ ఈ చిత్ర సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ వెంకీకి వెల్కమ్ చెబుతూ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో వెంకీ కొంచెం గడ్డం, గ్లాసెస్ పెట్టుకుని కూల్ లుక్ లో కనిపిస్తున్నారు. 

వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఈ వీడియోలో తెలిపారు. వెంకీ ఎక్స్ కాప్.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి.. భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. 

 

ఈ మేకింగ్ వీడియో ద్వారానే రిలీజ్ ఎప్పుడో కూడా క్లారిటీ ఇచ్చేశారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవుతున్నట్లు మరోసారి కంఫర్మ్ చేశారు. అంటే చిరంజీవి విశ్వంభర చిత్రానికి పోటీగా వెంకీ మామ రంగంలోకి దిగుతున్నాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios