Asianet News TeluguAsianet News Telugu

పాపం వెంకీ తన కోబ్రో కోసం వస్తే లావణ్య పట్టించుకోలేదుగా.. వరుణ్ తేజ్ రిసెప్షన్ లో ఫన్నీ ఇన్సిడెంట్, వైరల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకతో దంపతులుగా మారారు.సండే రోజున హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుక సైతం నిర్వహించారు. రిసెప్షన్ కి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.

Venkatesh funny conversation with Varun Tej at reception dtr
Author
First Published Nov 6, 2023, 7:40 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకతో దంపతులుగా మారారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మిస్టర్ మూవీతో మొదలైన వీరి ప్రేమాయణం రహస్యంగా సాగింది. వీరిద్దరూ అఫీషియల్ గా కనిపించే వరకు ఒక్క రూమర్ కూడా రాలేదు.  మొత్తంగా ఎంతో గ్రాండ్ గా వీరిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో జరిగింది. 

సండే రోజున హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుక సైతం నిర్వహించారు. రిసెప్షన్ కి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. నూతన వధూవరులని ఆశీర్వదించారు. ఇక వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ ఇద్దరూ ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలలో కోబ్రోస్ గా నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. 

ముఖ్యంగా ఎఫ్ 2 చిత్రంలో వీరిద్దరి కామెడీ హైలైట్ గా నిలిచింది. తన కోబ్రో ని విష్ చేసేందుకు వెంకటేష్ రిసెప్షన్ కి హాజరయ్యారు. అయితే ఆ సమయంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అది కాస్తా నెటిజన్లకు చిక్కడంతో మీమ్స్ కుప్పలు తెప్పలుగా వైరల్ అవుతున్నాయి. ఎఫ్ 2 చిత్రంలోని వరుణ్ తేజ్ చెప్పిన 'నేను నీ లెక్క కాదు.. పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం మస్త్ తెలుసు' అనే డైలాగ్ ని ఈ వీడియోకి జోడిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇంతకీ వెంకటేష్ వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే.. వెంకీ రాగానే వరుణ్ తేజ్ హగ్ చేసుకుని చేసుకున్నాడు. వెంకీ ఇద్దరినీ విష్ చేయాలనుకుంటుండగా.. లావణ్య మాత్రం పక్కనే ఉన్న అతిథులతో మాట్లాడుతూ బిజీగా ఉండిపోయింది. వెంకటేష్ రాకని కూడా ఆమె గమించలేదు. దీనితో వరుణ్ తేజ్ వెంకీ తో ఫన్నీగా ఒక సైగ చేశాడు. లేటుగా వెంకీని గమనించిన లావణ్య ఆయన్ని పలకరించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లని తెగ ఆకట్టుకుంటోంది.

Follow Us:
Download App:
  • android
  • ios